
Hon’ble CM Sri A. Revanth Reddy participated in Meeting on Irrigation Department at Jyotirao Phule Praja Bhavan, Hyderabad.
కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నీటి హక్కులను కాపాడుకోవడంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందని చెప్పారు.




