ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Darshan and Pooja at Sri Lakshmi Narasimha Swamy Temple, Yadagirigutta, Yadadri Bhuvanagiri District

పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం అందించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Performs Bhoomi Pooja for Sri Lakshmi Narasimha Swamy Veda Patashala at Yadagirigutta & Launches Devt Works at Temple City.

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని భూమిపూజ చేశారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఆ మహానేత విగ్రహానికి ముఖ్యమంత్రి గారు పుష్పాంజలి ఘటించారు.

మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ లాంటి మహానాయకుల స్ఫూర్తితో పనిచేస్తూ రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించారని అన్నారు. టెలికాం, కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక విప్లవం తేవడమే కాకుండా పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేసినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని భావించి స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Way2news conclave 2026 at JRC Convention, Hyderabad.

“రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది” అన్న థీమ్‌తో వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, రాజకీయాల వంటి అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు సూటిగా, నిర్మొహమాటంగా ఈ వేదిక ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది.

హైదరాబాద్ లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరిస్తున్నట్లు ఖోస్రోషాహి గారు తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తిని వ్యక్తీకరించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inaugural Programme of Education Week as part of Praja Palana – Pragathi Pranalika at LB Stadium, Hyd.

 ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. కోర్ అర్బన్ ఏరియా CURE లో 1011 కోట్ల రూపాయలతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు.

Skip to content