ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Sri A. Revanth Reddy inspected the construction progress of the Future City Development Authority office and the Young India Skills University campus.

భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)కి సంబంధించిన భవన సముదాయాల నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Telangana Legislators’ Sports & Cultural Meet 2026 at Ravindra Bharathi, Hyderabad.

క్రీడలు, సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి గారితో పాటు మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Inaugural Ceremony of 1st Edition of Telangana Legislators’ Sports Meet 2026 at LB Stadium, Hyd.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే శాసనమండలి, శాసనసభ సభ్యులకు 14 సంవత్సరాలుగా నిలిచిపోయిన క్రీడా సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తిరిగి ప్రారంభించారు. ప్రారంభించడమే కాకుండా సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు క్రీడల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని కలిగించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in launch of the Breakfast Scheme for Anganwadi children and distribution of mobiles to Anganwadi teachers at the Assembly Conference Hall, Hyd.

శాసనసభ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం “తొలి ముద్ద”ను ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీని ప్రారంభించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the foundation stone ceremony of Sri Omkareshwara Swamy Temple at Machileshwara Veerabhadra Swamy Temple, Manchirevula, organised by MRDCL

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట – మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోవు పూజ నిర్వహించి గోశాలను ప్రారంభించారు. శ్రీ మచిలేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Sri Sita Rama Kalyana Mahotsavam at Bhadrachalam & Bhoomi Puja for Temple Development Works.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

Skip to content