జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న స్టేజీ -1 పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. నీటి పారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి పలు సూచనలు చేశారు.
* ఉమ్మడి మహబూబ్‌నగర్ నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి గారు మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ సైట్‌ను ఏరియల్ సర్వే చేశారు.
* అక్కడి నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి చేరుకున్న ముఖ్యమంత్రి గారు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజీ -1 పంప్ హౌజ్ పనులను పరిశీలించారు.
* మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారితో కలిసి ఆ ప్రాజెక్టుపై రూపొందించిన లఘు చిత్రాన్ని వీక్షించారు.
As part of the Jawahar Nettempadu Lift Irrigation Scheme, Chief Minister Sri A. Revanth Reddy inspected the Stage-1 Pump House under construction. He sought details from the Irrigation Department officials and offered several suggestions.
* As part of his whirlwind tour of the district to review the progress of irrigation projects in the erstwhile Mahabubnagar region, the Chief Minister inspected the works of the Makthal–Narayanpet–Kodangal Lift Irrigation Scheme (MNKLIS).
* He later conducted an aerial survey of the Koilsagar Project, the proposed barrages across the Bhima and Krishna rivers, and the dam site of the Priyadarshini Jurala Project.
* Subsequently, the Chief Minister reached Gudendoddi village in Dharur Mandal of Jogulamba Gadwal district and inspected the works of the Stage-1 Pump House of the Nettempadu Lift Irrigation Scheme.
* Along with Ministers N. Uttam Kumar Reddy and Vakiti Srihari, he also watched a short documentary prepared on the project.
