రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.

విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారితో పాటు ఇంధన శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
సోలార్ పవర్ పైన స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోలార్ స్టౌల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు.
విద్యుత్ సబ్స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద భూమి అందుబాటులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో రెండు సబ్ స్టేషన్ల పక్కన ప్రయోగాత్మకంగా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్లు (హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున) నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (Rythu Discom) లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
To meet the increasing energy demand from upcoming industrial estates, high-speed rail corridors, and projects like the Regional Ring Road (RRR), Hon’ble Chief Minister Sri A. Revanth Reddy has ordered the immediate commencement of substation construction across the state.
During a high-level review meeting on the electricity department, the Chief Minister, joined by Hon’ble Deputy Chief Minister Sri Mallu Bhatti Vikramarka, assessed the current power situation. MP Vem Narender Reddy and senior energy department officials were also in attendance.
Under the Green Energy Policy, instructions were issued to process applications based on priority and ensure that permissions for massive data centers are granted without delay.
The Chief Minister emphasized the importance of empowering women in Self-Help Groups (SHGs) by educating them on solar energy and encouraged initiatives to increase public awareness regarding the use of solar stoves.
To optimize infrastructure, solar power plants are to be established adjacent to electricity substations, with a pilot project launching at two locations in each undivided district where land is currently available.
For the construction of these 18 pilot solar plants—spanning two per district across nine undivided districts, excluding Hyderabad—the Chief Minister directed the appointment of dedicated nodal officers to oversee the process.
To modernize the grid, the use of AI technology was recommended to rectify supply defects and improve distribution, while officials were tasked with clearing employee misconceptions regarding the Telangana Rythu Power Distribution Company Limited (Rythu Discom).
