Hon’ble CM Sri A. Revanth Reddy participated in foundation stone laying and inauguration of various development works, followed by a public meeting at Pipri, Adilabad.

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పెద్దఎత్తున చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపనలు చేశారు.

శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:

▪️ బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామంలో (₹ 200 కోట్ల అంచనా వ్యయం) యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం.

▪️ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో (₹ 200 కోట్లు) యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం.

▪️ బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో (₹ 45.15 కోట్ల అంచనా వ్యయం) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం.

▪️ శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి & సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన (₹ 20.10 కోట్ల అంచనా వ్యయం).

▪️ ఆదిలాబాద్ నియోజకవర్గంలో (₹ 20 కోట్ల అంచనా వ్యయం) తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాల (బాలికలు) భవనం.

▪️ ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో (₹ 13.46 కోట్ల అంచనా వ్యయం) నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభోత్సవం.

▪️ ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన (₹ 15.00 కోట్లు).

▪️ బోథ్ నియోజకవర్గం (₹ 30.00 కోట్ల అంచనా వ్యయం) ఇచ్చోడ రోడ్డు నుండి డెడ్రా గ్రామం రోడ్డు నిర్మాణం.

▪️ ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్‌లో (₹ 20 కోట్లు) మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల (బాలురు) భవనం.

▪️ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో (₹ 30 కోట్ల) 38 వివిధ రకాల అభివృద్ధి పనులు.

▪️ బోథ్ నియోజకవర్గం ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్‌లలో (₹ 8.99 కోట్ల అంచనా వ్యయంతో) 3 (33/11KV) విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం.

▪️ బోథ్ నియోజకవర్గంలో (₹ 50.70 కోట్ల అంచనాలతో) పిప్రి ఎత్తిపోతల పథకం.

▪️ బోథ్ నియోజకవర్గంలో (₹ 44.64 కోట్లు) తేజాపూర్ ఎత్తిపోతల పథకం.

▪️ ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో (₹ 65.85 కోట్ల అంచనా వ్యయం) ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకం.

▪️ ఆదిలాబాద్ నియోజకవర్గంలో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర (₹ 6.435 కోట్ల అంచనా) చెక్ డ్యాం నిర్మాణం.

▪️ ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో (₹ 31.52 కోట్ల అంచనా) చిక్‌మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణం.

▪️ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ (₹ 11.76 కోట్ల అంచనాతో) రిపేర్ పనులకు శంకుస్థాపన.

As part of the ‘Praja Palana – Pragathi Pranali’ program, Hon’ble Chief Minister Shri A. Revanth Reddy laid the foundation stone for several large-scale development projects in Adilabad district.

The foundation stones were laid during a program organized at Pipri village in Bazarhathnoor mandal, in the presence of Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, ministers, and public representatives.

Details of the works for which foundation stones were laid:

▪️ Construction of Young India Integrated Gurukul School in Adegama village, Boath constituency (Estimated cost: ₹ 200 Crores).

▪️ Construction of Young India Integrated Residential School Complex in Sirgapur village, Dilawarpur mandal, Nirmal district (₹ 200 Crores).

▪️ Construction of Advanced Technology Center in Pochera village, Boath mandal (Estimated cost: ₹ 45.15 Crores).

▪️ Foundation stone for Shri Nagoba Temple Development & Beautification Project (Estimated cost: ₹ 20.10 Crores).

▪️ Construction of Telangana Minority Residential School & Junior College (Girls) building in Adilabad constituency (Estimated cost: ₹ 20 Crores).

▪️ Inauguration of the newly constructed bridge in Kondapur village, Sirikonda mandal, Adilabad district (Estimated cost: ₹ 13.46 Crores).

▪️ Foundation stone for the construction of the new ITDA building in Utnoor, Khanapur constituency (₹ 15.00 Crores).

▪️ Road construction from Ichoda Road to Dedra village in Boath constituency (Estimated cost: ₹ 30.00 Crores).

▪️ Construction of Mahatma Jyotiba Phule Telangana Backward Classes Welfare Residential School (Boys) building in Jainath, Adilabad constituency (₹ 20 Crores).

▪️ 38 various types of development works in Adilabad Municipality (₹ 30 Crores).

▪️ Construction of 3 (33/11KV) Electrical Substations in Dhannur, Kupti, and Kuchlapur of Boath constituency (Estimated cost: ₹ 8.99 Crores).

▪️ Pipri Lift Irrigation Scheme in Boath constituency (Estimated cost: ₹ 50.70 Crores).

▪️ Tejapur Lift Irrigation Scheme in Boath constituency (₹ 44.64 Crores).

▪️ Mutnoor Small Lift Irrigation (Triveni Sangamam) Scheme in Indervelli mandal, Khanapur constituency (Estimated cost: ₹ 65.85 Crores).

▪️ Construction of a Check Dam near Landasangi Pump House in Adilabad constituency (Estimated cost: ₹ 6.435 Crores).

▪️ Construction of Chikman Vagu Project in Sirikonda mandal, Khanapur constituency (Estimated cost: ₹ 31.52 Crores).

▪️ Foundation stone for repair works of Ammanamadugu Vagu Project in Kerameri mandal, Kumuram Bheem Asifabad district (Estimated cost: ₹ 11.76 Crores).