రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అద్దె భవనాల్లో కాకుండా వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవాల్లో కొనసాగేలా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.
శాసనసభ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్‌వాడీ చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం “తొలి ముద్ద”ను ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. వారి ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టాం. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లితో పాటు కడుపులోని శిశువు, అలాగే పుట్టిన తర్వాత పిల్లలకు ఎలాంటి పోషకాహారం అందించాలన్న అంశాలపై సమగ్రంగా చర్చించిన తర్వాత ఈ కార్యాచరణ చేపట్టాం.
అయితే, ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమం తీసుకొచ్చినా, క్షేత్రస్థాయి సిబ్బంది సరిగా అమలు చేసినప్పుడే దీనికి గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఆ గురుతర బాధ్యత మీదే. ఆకలిని మీరు అమ్మగా అర్థం చేసుకుంటారని, సమస్యల పట్ల మీకు అవగాహన ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
మొదటి 6 సంవత్సరాలు పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అత్యంత కీలక దశ. ఈ సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం అందించకపోతే ఆశించిన ఎదుగుదల ఉండదు. అందుకని అత్యంత పకడ్బంధీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అత్యంత విలువైన బాల్య దశ మీ చేతుల్లో ఉంది.
దేశంలో జనాభా పోషకాహారం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. చికిత్స కన్నా జబ్బు రాకుండా చర్యలు తీసుకోవాలి.
అంగన్‌వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తోంది. ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా ముందుగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తాం” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క గారు, కొండా సురేఖ గారు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పలు అంగన్‌వాడీ టీచర్లు, పలువురు పిల్లలు పాల్గొన్నారు.
Marking a significant step towards strengthening child nutrition and early childhood care, the “Tholi Mudda” breakfast scheme for Anganwadi children was launched by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, with a strong emphasis on health, nourishment, and holistic development.
He directed officials to prepare a comprehensive action plan for constructing dedicated buildings for Anganwadi centres across the State, ensuring that within the next three years, all centres function from their own buildings instead of rented premises.
At a programme held in the Legislative Assembly meeting hall, the Chief Minister also flagged off the distribution of mobile phones to Anganwadi teachers.
Addressing the gathering, he said, “Providing nutritious food to children is our foremost responsibility. This prestigious initiative has been designed with a clear focus on improving their health. The plan has been developed after detailed deliberations on the nutritional needs of pregnant women, the unborn child, and children after birth.”
He emphasized that even the best government initiatives achieve true recognition only through effective implementation at the grassroots level, expressing confidence that Anganwadi staff will carry out their responsibilities with compassion and dedication.
Highlighting the importance of early childhood, he noted that the first six years are crucial for a child’s growth and development, and that without proper nutrition during this phase, optimal development cannot be achieved.
The Chief Minister further observed that many health issues arise due to poor nutrition and stressed the need to prioritize preventive care over post-illness expenditure.
Reaffirming the government’s commitment, he stated that Anganwadi workers are considered part of the government family and assured that their issues will be addressed on priority as fiscal space becomes available.
Ministers Danasari Anasuya (Seethakka) and Konda Surekha, along with Chairperson of the Commission for Protection of Child Rights Seetha Dayakar Reddy, senior officials, Anganwadi teachers, and children participated in the programme.
