Hon’ble CM Sri A. Revanth Reddy inspected the construction progress of the Future City Development Authority office and the Young India Skills University campus.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)కి సంబంధించిన భవన సముదాయాల నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు.

ఫ్యూచర్ సిటీ అథారిటీ భవన నిర్మాణ పనులతో పాటు ఆ ప్రాంత రూపకల్పనలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే, స్కిల్స్ యూనివర్సిటీకి చెందిన పలు భవనాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి గారి వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు గారు, ఇతర అధికారులు ఉన్నారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inspected the construction progress of the Future City Development Authority (FCDA) office and the Young India Skills University (YISU) campus, being developed as part of the Telangana government’s prestigious Bharat Future City.

During the visit, the Chief Minister reviewed the architectural designs of the area alongside the FCDA building works and provided several suggestions to the officials. He further examined various blocks of the Skills University and directed the authorities to accelerate the pace of work to ensure timely completion.

Chief Secretary Sri Ramakrishna Rao, Young India Skills University Vice-Chancellor Sri Subba Rao, and other senior officials were present during the inspection.