
Hon’ble CM Sri A. Revanth Reddy inspects Medigadda Barrage site and reviews restoration plans for the damaged Kaleshwaram Lift Irrigation Project.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మేడిగడ్డ డ్యామ్ సైట్ను చేరుకున్న ముఖ్యమంత్రి గారు పునరుద్ధరణ చేపట్టడానికి సంబంధించి జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను పరిశీలించారు.




