ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Regional Meeting of Urban Development Ministers at Hyderabad.

హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డ్యూల పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల ప్రాంతీయ సదస్సును కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participated in Ramoji Excellence Awards Programme at Ramoji Film City.

రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participated in Koti Deepotsavam 2025 at NTR Stadium, Hyderabad.

కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ వేడుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావలసిన అవసరం ఉందని, కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి లేఖ రాస్తానని తెలిపారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Visited SLBC Tunnel-1 at Achampet Mandal, Nagarkurnool District.

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Visits Flood-Affected Areas in Hanumakonda District.

వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ పరిశీలన అనంతరం, హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి గారు పట్టణంలోని సమ్మయ్య నగర్‌, కాపువాడ, పోతననగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Police Flag Day Parade at Police Martyrs Memorial, Goshamahal.

“పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్‌లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

Skip to content