ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Revanth Reddy participated in development works & public meeting at MVS College Grounds, Mahabubnagar.

‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Hon’ble CM Revanth Reddy participated in Bhoomi Puja for IIIT Mahabubnagar, interacts with students at Chitteboyinapalli (Jadcherla).

మహబూబ్ నగర్ జిల్లా జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) కు భూమిపూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి గారు విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి గారు స్పందించి, విద్యకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy at Koluvula Panduga – Appointment Letters to TGPSC Group-III Candidates at Shilpakala Vedika, Hyderabad.

ప్రజా పాలనలో కొలువుల పండుగలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in public meeting at NTR Stadium, Nirmal town, Nirmal district.

ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో రూ. 386.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి బాట” బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

Hon’ble CM Revanth Reddy inaugurated Sadarmat Barrage and releases water for Yasangi crops at Nirmal district.

నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో సదర్మట్‌ బ్యారేజీని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి, యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు.

Hon’ble CM Revanth Reddy participated in inauguration of Chanaka-Korata Pump House & release of water into main canals at Adilabad District.

ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాక-కొరాటా బ్యారేజ్ పంప్‌హౌస్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. లోయర్ పెనుగంగ్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు.

Skip to content