
‘Telangana Rising’ Delegation Led by Hon’ble Chief Minister Shri A. Revanth Reddy Receives Warm Welcome in Zurich.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు.

ఆదివాసీల అతిపెద్ద పండుగ అయిన మేడారం సమ్మక్క – సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదం పొందారు.

సమ్మక్క – సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపు 362 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్, ఏదులాపురంలోని జేఎన్‌టీయూ కళాశాలకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రఖ్యాత సూఫీ, గజల్ గాయని శ్రీమతి అనితా సింఘ్వీ గారి గజల్ సంగీత విభావరి కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు.

‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on May 25, 2026.