ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

ఛాయాచిత్రాల ప్రదర్శన

Hon’ble CM Sri A. Revanth Reddy Visited SLBC Tunnel-1 at Achampet Mandal, Nagarkurnool District.

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Visits Flood-Affected Areas in Hanumakonda District.

వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ పరిశీలన అనంతరం, హనుమకొండ చేరుకున్న ముఖ్యమంత్రి గారు పట్టణంలోని సమ్మయ్య నగర్‌, కాపువాడ, పోతననగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Police Flag Day Parade at Police Martyrs Memorial, Goshamahal.

“పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్‌లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy pays floral tribute to Mahatma Gandhi at Bapu Ghat, Langer House.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Inauguration of Bathukamma Kunta Lake and public meeting at Amberpet.

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కబ్జాల నుంచి రక్షించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అంబర్ పేట బతుకమ్మకుంటను బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the inauguration of Sewage Treatment Plants (STP) at Amberpet.

హైదరాబాద్ అంబర్‌పేట్ వద్ద నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. వీటికి తోడు మురుగునీటి శుద్ధి కోసం రూ. 3849.10 కోట్లతో కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

Skip to content