
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy pays tribute to poet AndeSri at Ghatkesar.
ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి పార్థివ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి నివాళులర్పించారు.

ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి పార్థివ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి నివాళులర్పించారు.

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.

కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ వేడుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావలసిన అవసరం ఉందని, కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి లేఖ రాస్తానని తెలిపారు.

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారి పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజ్‌భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు మహమ్మద్ అజారుద్దీన్ గారితో ప్రమాణం చేయించారు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం” సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్‌లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో లైసెన్స్ సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్స్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలువుల పండుగ” కార్యక్రమంలో భాగంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాల అందజేశారు.

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారితో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కబ్జాల నుంచి రక్షించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అంబర్ పేట బతుకమ్మకుంటను బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on December 1, 2025.