గత ప్రభుత్వంలో చేసిన అప్పులను ఒకవైపు చెల్లిస్తూనే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.

గడిచిన 70 ఏళ్ల కాలంలో తీవ్ర అన్యాయానికి గురైన పాలమూరు జిల్లాకు, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు అభివృద్ధి చేసుకోవద్దని సూటిగా ప్రశ్నించారు. కరువు కాటకాలు, వలసలతో మగ్గిపోయిన పాలమూరు జిల్లాను కచ్చితంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
2028 డిసెంబర్ నాటికి కృష్ణానది జలాలతో కొడంగల్ భూములను తడిపి పచ్చని పంటలు పండించేలా చేయడం తన బాధ్యతగా చెప్పారు. అందుకు పోలేపల్లి ఎల్లమ్మ అమ్మవారి మీద ఆన అంటూ.. మాటిచ్చారు.
ఎల్‌నినో ప్రభావం, పరిస్థితుల నేపథ్యంలో వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత “ప్రజాబలం” కార్యక్రమం చేపట్టి రాష్ట్రం నలుమూలల పర్యటిస్తానని తెలిపారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన రైతన్నతో ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు నియోజకవర్గం పరిధిలో రూ. 9,053 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయంలో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రైతులతో కలిసి పాదయాత్రగా సభకు చేరుకున్నారు.
ఈ ఆత్మీయ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, వాకిటి శ్రీహరి గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఈ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, పాలమూరు ఏనాడూ అభివృద్ధికి నోచుకోలేదని జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఎంతో మంది నాయకులు వచ్చినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదని, ఈ ప్రాంతం పంటలకు నోచుకోలేదని ముఖ్యమంత్రి గారు అన్నారు.
భీమా – నెట్టెంపాడు – కోయిల్‌సాగర్, జూరాల, పాలమూరు రంగారెడ్డి దశాబ్దాలైనా అడుగు ముందుకు పడలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకున్నా ప్రయోజనం దక్కలేదన్నారు. మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పదేండ్లు పక్కనపెట్టారని ఆరోపించారు.
అవకాశం వచ్చినప్పుడు ఎందుకు అభివృద్ధి చేసుకోవద్దని ప్రశ్నించారు. కొడంగల్ ప్రాంతంలో వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలు అండగా నిలవాలి. ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించుకుంటూనే మరోవైపు తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు.
ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసి, పరిశ్రమలు స్థాపించడం ద్వారా వేలాది యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాజేంద్రనగర్ నుంచి చేవెళ్ల, షాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాలకు రహదారుల అభివృద్ధితో పాటు పరిశ్రమలు కూడా రానున్నాయని వివరించారు.
ఎల్‌నినో ప్రభావం, తలెత్తిన పరిస్థితులను అవగాహన చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు లేక తీవ్రనీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తాయని పేర్కొంటూ రైతులు ఆరుతడి పంటలు వేయాలని ముఖ్యమంత్రి గారు కోరారు.
అందరం కలిసికట్టుగా ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందామని, వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత “ప్రజాబలం” అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఉత్పన్నమైన పరిస్థితుల్లో సన్నబియ్యం గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, ఒక సీజన్లో వడ్లు పండించకపోయినా ప్రభుత్వం వద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
With a commitment to making Telangana the number one developed state in the country, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said the government was resolving public issues while repaying the debts incurred by the previous government.
He asserted that Palamuru, long affected by drought, migration and neglect, would be developed and promised to bring Krishna river water to Kodangal farmlands by December 2028, taking an oath in the name of Polepally Yellamma Thalli.
Addressing the Rythannatho Atmeeya Sabha at Lagacharla Industrial Park in Kodangal, Vikarabad district, he announced that the “Praja Balam” programme would begin after Sankranti, with visits across the state.
Earlier, he unveiled foundation plaques for development works worth ₹9,053 crore, offered prayers at Polepally Yellamma Temple and undertook a Pada Yatra to the meeting venue alongside farmers.
Highlighting delays in major irrigation projects, including Bhima, Nettempadu, Koilsagar, Jurala and Palamuru-Rangareddy, he also alleged that the Makthal–Narayanpet–Kodangal Lift Irrigation Scheme had been neglected for a decade.
He said industrial investments in Kodangal would generate employment for thousands of youth, alongside improved road connectivity through Rajendranagar, Chevella, Shabad and Pargi.
In view of El Niño and the possibility of water shortages, he advised farmers to take up short-duration and dryland crops and called for collective efforts to overcome the situation. He also assured people of sufficient fine rice stocks.
Assembly Speaker Gaddam Prasad Kumar, Deputy CM Mallu Bhatti Vikramarka, Ministers, Advisor Sudarshan Reddy, MLC and TPCC President Mahesh Kumar Goud, MPs, public representatives and farmers attended the meeting.
