ఒకవైపు దీపావళి పర్వదినం. మరోవైపు జన్మదినం. ఈ రెండు శుభసందర్భాల జ్ఞాపకంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగను జరుపుకున్నారు.

ఒకవైపు దీపావళి పర్వదినం. మరోవైపు జన్మదినం. ఈ రెండు శుభసందర్భాల జ్ఞాపకంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగను జరుపుకున్నారు. కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

🎇 ఈ శుభ సందర్భంగా దంపతులకు ముఖ్యమంత్రి గారు నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం వారింట్లోనే సన్నబియ్యంతో వండిన భోజనాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి గారితో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు సన్నబియ్యం భోజనం చేశారు.

🎇 ఆ తర్వాత అక్కడ సీఎం గారి చుట్టూ చేరుకున్న పిల్లలు టపాసులు కాల్చగా ముఖ్యమంత్రి గారు వారితో కలిసి “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పిల్లలందరికీ పెన్నులను బహూకరించారు.

Marking the twin occasions of Diwali and his birthday, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy celebrated the festival of lights at an Indiramma house in Parsapur village of Kodangal mandal. He inaugurated the newly constructed home of Goripalli Sumitra and Srinivas.

🔹 On the occasion, the Chief Minister presented new clothes to the couple and later had a meal prepared with fine rice at their home. Hon’ble Assembly Speaker Gaddam Prasad Kumar, Ministers Damodar Rajanarasimha, Jupally Krishna Rao and Danasari Anasuya Seethakka, MP Vem Narender Reddy and MLAs joined the Chief Minister for the meal.

🔹 Later, children gathered around the Chief Minister and burst firecrackers as he joined them in the “Maa Indiramma Intlo Deepavali (Diwali at Our Indiramma House)” celebrations. He also gifted pens to all the children.