
ఎల్నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.
ఎల్నినో వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరిస్థితి తీవ్రతపై ఆ సమావేశంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.








