దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.

✅ రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST (Prevention of Atrocities) Act, 1989) అమలుపై ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.

✅ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2013 ఫిబ్రవరి 11న అనాటి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన చట్టం అమలుపై ఈ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మళ్లీ ఈ సమావేశం జరగడం ఇదే తొలిసారి.

✅ ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, ఎంపీలు మల్లు రవి గారు, బలరాం నాయక్ గారు, కడియం కావ్య గారు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారు, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు గారు, మేడిపల్లి సత్యం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, వేముల వీరేశం గారు, మందుల సామేల్ గారు, మట్టా రాగమయి గారు, వెడ్మ బొజ్జు గారు, మురళి నాయక్ గారు పాల్గొన్నారు.

✅ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, డీజీపీ సీవీ ఆనంద్ గారు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య గారు, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు గారు, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

✅ రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం, పునరావాసంపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరును విశ్లేషించారు.

✅ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో ప్రధానంగా 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

✅ అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇలాంటి ఘటనల్లో బాధితులకు సకాలంలో నష్టపరిహారం, సహాయ పునరావాసం అందేలా చూడాలన్నారు. బాధితులను ఆదుకోవడంలో బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్‌లో విడుదల చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

✅ ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి, బాధిత కుటుబాలకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

✅ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. సొంత తల్లిలా ప్రేమ చూపిన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారిని ఆ వర్గాలు ఇప్పటికీ మరిచిపోలేదని పేర్కొంటూ, 25 లక్షల ఎకరాల భూములకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీ గారిదని అన్నారు.

✅ శ్రీమతి ఇందిరా గాంధీ గారి స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 16 శాతం ఉంటే, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో 31 శాతం మంది లబ్ధిదారులు ఎస్సీలేనని, ఎస్టీ జనాభా 10 శాతం ఉంటే, వారికి 17 శాతం ఇండ్లను మంజూరు చేశామని వివరించారు.

✅ రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని, తద్వారా ఆ వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నామని చెప్పారు.

✅ సంక్షేమ పథకాలతో పాటు చదువు ఒక్కటే అందరి జీవితాలను మారుస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు నొక్కిచెప్పారు. అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్యలు పరిష్కారం కావని గుర్తుచేశారు. పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు. దళితులు, గిరిజనులు,ఆదివాసీల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

The People’s Government is working with commitment towards the development of Dalits, tribals and Adivasis, said Hon’ble Chief Minister Sri A. Revanth Reddy. He stressed that education, employment and skill development can bring social change and called for collective efforts beyond politics to overcome discrimination against SCs and STs.

🔹 A State-level High-Powered Vigilance and Monitoring Committee meeting on the implementation of the SC/ST (Prevention of Atrocities) Act, 1989, was held under the Chief Minister’s chairmanship at Dr. B.R. Ambedkar Telangana Secretariat. It was the first such meeting in Telangana since state formation.

🔹 The meeting reviewed implementation of the Act, cases, investigation, trials, case disposal, victim assistance and rehabilitation, awareness programmes, and special and mobile courts. Officials said atrocity cases against SCs and STs have declined over the past five years. The Chief Minister directed special focus on 73 villages reporting higher cases and regular meetings of district-level vigilance committees.

🔹 He directed that compensation, assistance and rehabilitation be provided to victims without delay through a green channel, without linking it to budget availability. He also directed speedy justice in the Shabad murder and Tukkuguda nurse murder cases.

🔹 The Chief Minister said the government is allocating funds in proportion to population and highlighted that SCs and STs account for 31% and 17% of Indiramma house beneficiaries respectively. He said 27.5 lakh students from nursery to Class 12 are being provided breakfast, while 3.48 crore people are receiving fine rice.

🔹 Emphasising that education alone can transform lives, he urged everyone to encourage children towards education and sports and work beyond political considerations for the development of Dalits, tribals and Adivasis.