ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులతో ఎదురవుతున్న సమస్యలు, వాటిని ఎదుర్కొనడానికి తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలపై ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 లో భాగంగా డిసెంబర్ 8న తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు.

డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్ల పురోగతిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
సమ్మిట్ వేదిక, వివిధ హాళ్లు, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు.
గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సమ్మిట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగానే ప్రతినిధులకు అందజేయడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించాలని సూచించారు. ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారితో పాటు భద్రతా అధికారిని నియమించాలని సూచించారు. సమ్మిట్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకునేందుకు, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానాలు అందించాలన్నారు. నవంబర్ 15 నాటికి సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గత ఏడాది తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌తో పోలిస్తే ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఒక ఎక్స్పో హాల్ ఉండగా, ఈసారి ఆరు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నారు.
పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సదస్సు కార్యక్రమాలను రూపొందించారు. సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్పో, క్లైమేట్ కాంక్లేవ్ల ఏర్పాట్లను అధికారులు వివరించారు.
రక్షా ఎక్స్‌పోలో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్షం, సైబర్ సెక్యూరిటీ రంగాలకు చెందిన ఆధునిక పరికరాలు, డ్రోన్లు, రోబోటిక్స్ ప్రదర్శించనున్నారు. వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షా ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఇప్పటివరకు 49 సంస్థలు ముందుకు వచ్చాయి.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలకు సంబంధించి ఇండియా జాయ్–2026 నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసి 136 స్టార్టప్‌ల ఆవిష్కరణలను ప్రదర్శించేలా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌లో భాగంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ఆహ్వానిస్తున్నారు.
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి 60 కంపెనీల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల పెవిలియన్‌లో ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయ డ్రోన్లు, పాడి, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, చేనేత, బతుకమ్మ, కాకతీయుల శిల్పకళతోపాటు రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు.
గ్లోబల్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. అలాగే, విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ఎడ్యుకేషన్ ఎక్స్‌పోలో ‘నర్సరీ నుంచి ఆక్స్ఫర్డ్ వరకు’ తెలంగాణ విద్యారంగం ప్రతిబింబించేలా సమ్మిట్‌లో చర్చలు జరగాలని చెప్పారు.
మూడు రోజుల సమ్మిట్‌లో నాలుగు ప్రధాన హాళ్లలో 52 రంగాలవారీ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సమ్మిట్ నిర్వహణ కోసం 25 రంగాలవారీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్ల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.
వాతావరణ మార్పులపై ప్రత్యేక చర్చ![]()
వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సమస్యలు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు డిసెంబర్ 8న ప్రత్యేకంగా తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు, రైతులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారు.
కరువును తట్టుకునే వ్యవసాయం, పశుసంరక్షణ, తాగునీటి భద్రత, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ, వ్యర్థాలను సంపదగా మార్చడం వంటి ఐదు ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.
ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక కార్యాచరణను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో కరువు, వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా ఈ సదస్సు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Amid the impact of El Niño and climate change, a special conclave on climate-related challenges will be held on December 8 as part of the Invest Telangana Global Summit-2026 to discuss immediate measures and long-term solutions.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy reviewed the summit arrangements with Ministers and senior officials at Dr B.R. Ambedkar Telangana State Secretariat. The three-day summit will be held from December 7 to 9 at the Young India Skills University campus in Bharat Future City.
The review covered the venue, exhibition halls, international invitations and programme arrangements. The Chief Minister directed officials to appoint a liaison officer for every delegate, share complete information in advance, ensure a hassle-free experience, invite Chief Ministers of other States and make robust security arrangements with dedicated departmental and security officers. Special invitations should be extended to companies interested in investment agreements and setting up industries. A comprehensive plan must be ready by November 15.
Officials said this year’s summit would be larger than last year’s Telangana Rising Summit, with six exhibition halls against one earlier. The summit will focus on investments, industries, technology, innovation and employment, featuring the Raksha Expo, India Joy, Startup Pavilion, Pharma and Life Sciences Expo, Agriculture and Allied Sectors Exhibition, Telangana Pavilion, Education Expo and Climate Conclave.
The Raksha Expo will showcase defence, aerospace, space and cybersecurity equipment, drones and robotics, besides aerial demonstrations. So far, 49 organisations have shown interest. India Joy-2026 will focus on animation, visual effects, gaming and comics.
The Startup Pavilion will showcase innovations from 136 startups. The Telangana Innovation Startup Challenge invites technological solutions for challenges in agriculture, education, healthcare, protection of government lands and public infrastructure.
The Pharma and Life Sciences Expo will feature 60 companies. The Agriculture Pavilion will highlight modern farming practices, agricultural drones, dairy, fisheries and food processing. The Telangana Pavilion will showcase the State’s history, culture, handlooms, Bathukamma, Kakatiya architecture, development and future plans.
The Chief Minister called for greater focus on tourism and suggested that the Education Expo highlight Telangana’s education journey from ‘Nursery to Oxford’, covering education, research and skill development.
Officials informed that 52 sector-specific sessions would be held across four main halls, with 25 sector-specific Executive Councils. The Chief Minister asked the Cabinet Sub-Committee, headed by Deputy Chief Minister Mallu Bhatti Vikramarka and comprising Ministers N. Uttam Kumar Reddy, Duddilla Sridhar Babu and Gaddam Vivek Venkataswamy, to regularly review the arrangements.
Special Focus on Climate Change
Around 200 scientists, farmers and experts will participate in the December 8 discussions on climate change and drought-related challenges.
Five key areas will be discussed: drought-resilient agriculture, livestock protection, drinking water security, protection from extreme temperatures, forests and biodiversity conservation, and converting waste into wealth.
The Chief Minister directed officials to identify climate-related challenges and formulate immediate measures and a long-term action plan. He stressed that the conclave should play a decisive role in developing a dedicated strategy to address drought and climate challenges in the State.
The Deputy Chief Minister, Ministers, Chief Secretary and other senior officials participated in the meeting
