Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in Sri Krishna Sadar Sammelanam at NTR Stadium, Hyderabad

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ సంకల్పానికి యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులతో మరింతగా అభివృద్ధి సాధించి, దేశంలోనే ఆదర్శనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని అన్నారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పెద్దఎత్తున నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, యాదవ సోదర సోదరీమణులందరికీ హైదరాబాద్ సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ నగరాభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందన్నారు. దేశంలో ఎక్కడి నుంచి ఏ పని కోసమైనా నగరానికి వచ్చిన వారందరినీ యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో, ఇక్కడ శాంతి భద్రతలను కాపాడటంలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు.
హైదరాబాద్ నగరం జాతీయస్థాయిలో పేరు ప్రతిష్ఠలను సాధించి అభివృద్ధి చెందిన నగరంగా నిలబెట్టడంలో యాదవ సోదరులు కష్టపడాలని కోరారు. యాదవుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడే విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహించలేదని గుర్తుచేస్తూ, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యాదవ సోదరుల విజ్ఞప్తి మేరకు సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు.
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ గారితో పాటు ఎన్నో ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని సదర్ ఉత్సవానికి మరింత శోభను తెచ్చారని వ్యాఖ్యానించారు.
 మొట్టమొదటిసారిగా కులగణన చేసి దేశానికి మార్గదర్శకంగా నిలబడ్డామని చెబుతూ, ఎవరెంత మేరకు ఉంటే అంత శాతం వాటా కల్పించాలన్న లక్ష్యంతో కులగణన చేశామని అన్నారు. యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించామన్నారు.
 ఈశ్వరమ్మ యాదవ్ గారికి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాలకమండలి సభ్యురాలిగా నియమించడమే కాకుండా యాదగిరిగుట్ట గోశాల బాధ్యతలను కూడా అప్పగించామని తెలిపారు.
 ఈ సదర్ ఉత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ గారు, ఎంపీలు అనిల్ కుమార్‌ యాదవ్‌ గారు, మల్లు రవి గారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ ధర్మేంద్ర యాదవ్ గారు, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, పలువురు ప్రజాప్రతినిధులు, శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, వివిధ రాష్ట్రాలకు చెందిన యాదవ ప్రతినిధులు పాల్గొన్నారు.
Calling for the Yadav community’s active participation in Hyderabad’s growth, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said the government aims to transform the city into a global destination through projects such as Musi Rejuvenation, Metro Rail expansion, Regional Ring Road and Bharat Future City, making it a model city in the country.
 The Chief Minister participated in the grand Sri Krishna Sadar Sammelanam at NTR Stadium, Hyderabad, and extended warm Sadar festival greetings to the Yadav community.
 Appreciating the Yadav community’s contribution to Hyderabad’s development and maintenance of law and order, he said their role in welcoming people from across the country was commendable. He called upon them to work towards enhancing the city’s national recognition and assured that their self-respect and rights would be protected.
 Recalling the recognition of Sadar Sammelanam as a State festival soon after his government assumed office, he said ₹5 crore had been released for the celebrations.
 He said Telangana had conducted a caste census for the first time, setting an example for the country, with the objective of ensuring representation in proportion to population. He added that the Yadav community had been given due representation in the government.
 The Chief Minister said Eshwaramma Yadav had been appointed to the Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple Governing Board and entrusted with the responsibility of the Yadagirigutta Gosala.
 Bihar former Deputy Chief Minister Tejashwi Yadav, Minister Ponnam Prabhakar, MPs Anil Kumar Yadav, Mallu Ravi and Dharmendra Yadav, PCC President and MLC Mahesh Kumar Goud, former Governor Bandaru Dattatreya, former MP and Festival Committee Chairman Anjan Kumar Yadav, several public representatives and Yadav community representatives from various States participated in the celebrations.