ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించడంతో పాటు దాదాపు రూ. 9,100 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తయిన భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.

✳️ నవంబర్ 7వ తేదీ (శనివారం)

ముఖ్యమంత్రి గారు ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. రైతు మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు.

✅అక్కడే ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించే ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి కొడంగల్ చేరుకుంటారు.

✳️ నవంబర్ 8వ తేదీ (ఆదివారం)

ఉదయం హకీంపేట చేరుకుని స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.

లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ. 81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. రూ. 4 కోట్లతో నాట్కో సంస్థ సీఎస్ఆర్ వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, రూ. 2.35 కోట్లతో నిర్మించిన హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం బొంరాస్‌పేటలో రూ. 4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను, రూ. 3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే, కొడంగల్‌లో రూ. 3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం తర్వాత దుద్యాలలో రూ. 3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్‌ భవనాన్ని, రూ. 12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.

కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ. 5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన చేస్తారు. ఈ రహదారిని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వద్ద, జాతీయ రహదారి 167N వరకు నిర్మించనున్నారు.

కోస్గిలో రూ. 6 కోట్లతో నిర్మించిన సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. దౌల్తాబాద్ మండలం బాలంపేటలో రూ. 2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. దౌల్తాబాద్‌లో రూ. 4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తారు. అనంతరం కొడంగల్ నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

✳️ రూ. 9,053 కోట్లతో 13 అభివృద్ధి పనులు

ముఖ్యమంత్రి గారు మూడు రోజుల పర్యటన సందర్భంగా మొత్తం రూ. 9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వీటిలో కొత్తవాల్‌గూడ నుంచి నాచారం వరకు రూ. 5,060 కోట్లతో రేడియల్ రోడ్డు -2, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ. 1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల పనులు, రూ. 2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్‌ రెండో దశ పనులు ఉన్నాయి.

విద్యా రంగంలో రూ. 118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, రూ. 123 కోట్లతో కొడంగల్‌లో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు ఉన్నాయి.

రూ. 41.83 కోట్లతో కొడంగల్, కోస్గి, మద్దూరులో ఆధునిక బస్టాండ్లు, రూ. 20 కోట్లతో మద్దూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, రూ. 20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం, రూ. 59.30 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ. 4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు.

హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం, రూ.81 కోట్లతో ఎకోపామ్‌ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు.

రూ. 46.08 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ భవనాలను ఈ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్నారు.

దుద్యాల సమీకృత మండల కార్యాలయ భవనం, కోస్గి సైన్స్ మ్యూజియం, హకీంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, హకీంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీటిలో ఉన్నాయి.

దుద్యాల, బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్లు, బొంరాస్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొడంగల్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు.

నవంబర్ 9వ తేదీ (సోమవారం)

ముఖ్యమంత్రి గారు కొడంగల్ నివాసం నుంచి హకీంపేటకు చేరుకుని అక్కడ రైతు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభకు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

🟠 CM’s Three-Day Visit to Kodangal from November 7 to 9

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy will tour Kodangal constituency for three days from November 7 to 9. The visit includes the inauguration of the Mega Farmers’ Fair and Industrial Expo, foundation stone ceremonies for development projects worth around ₹9,100 crore and inauguration of completed government buildings.

🟠 November 7 (Saturday)

🔹 The Chief Minister will reach Hakimpet in Dudyala mandal at 11 AM and inaugurate the Mega Farmers’ Fair and Industrial Expo. He will visit the stalls, interact with progressive farmers and agricultural scientists, meet industrialists and proceed to Kodangal.

🟠 November 8 (Sunday)

The Chief Minister will participate in an interaction with Self-Help Group women at Hakimpet and unveil plaques for development works. He will lay the foundation stone for the ₹81 crore EcoPalm Palm Oil Factory in Lagacherla Industrial Corridor.

He will inaugurate the Hakimpet ZP High School and Government Junior College buildings (₹4 crore, NATCO CSR), Hakimpet PHC (₹2.35 crore), Bomraspet Government Junior College (₹4.79 crore) and Police Station (₹3 crore), Kodangal Police Station and Circle Office (₹3.80 crore), Dudyala Police Station (₹3 crore) and Integrated Mandal Office Complex (₹12 crore).

At Nacharam in Kosgi mandal, he will lay the foundation stone for Radial Road-2 (₹5,060 crore), connecting Kothwalguda near the ORR to NH-167N at Nacharam. He will also inaugurate the Kosgi Science Museum (₹6 crore), Balampet PHC (₹2.35 crore) and Doulthabad Government Junior College (₹4.79 crore), before staying overnight at Kodangal.

🟠 Development Projects Worth ₹9,053.48 Crore

The visit will feature foundation stone ceremonies and plaque unveilings for 13 development projects worth ₹9,053.48 crore. Major projects include Radial Road-2 (₹5,060 crore), 223 new and incomplete BT road works under Special Development Funds (₹1,410 crore) and the second phase of MNKLIS (₹2,100 crore).

Education projects include 10 Telangana Public Schools (₹118.80 crore) and an Agriculture College at Kodangal (₹123 crore). Other works include modern bus stations at Kodangal, Kosgi and Maddur (₹41.83 crore), an NAC Skill Development Centre at Maddur (₹20 crore), an Integrated Divisional Office Complex (₹20 crore) and road works (₹59.30 crore).

The government has allocated ₹4.45 crore for Gurulok Masand Prabhu Mandir at Thimmareddypally and ₹5.10 crore for Niranjan Math at Kodangal. A tourism hotel at Hakimpet Industrial Corridor (₹10 crore) and the EcoPalm Palm Oil Factory (₹81 crore) are also planned.

🔹 The Chief Minister will inaugurate completed government buildings worth ₹46.08 crore, including the Dudyala Integrated Mandal Office Complex, Kosgi Science Museum, Hakimpet school and college buildings, Hakimpet PHC, Dudyala and Bomraspet Police Stations, Bomraspet Junior College, Kodangal Police Station and Circle Office, Doulthabad Junior College and Balampet PHC.

🟠 November 9 (Monday)

🔹 The Chief Minister will attend and address a farmers’ public meeting at Hakimpet. Around 50,000 farmers from Rangareddy, Vikarabad, Narayanpet, Sangareddy, Medak, Mahabubnagar, Wanaparthy, Jogulamba Gadwal, Nagarkurnool and Medchal-Malkajgiri districts are expected to attend.