భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని ముఖ్యమంత్రి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 దాదాపు 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ రంగాల ఎక్స్‌పోగా నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మిట్ కోసం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, సలహాదారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) ప్రాంగణంలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని ముఖ్యమంత్రి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్ వేదిక, వివిధ హాళ్లు, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్‌ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమ్మిట్ కోసం వివిధ రంగాల నుంచి దాదాపు వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతినిధులు సులభంగా ప్రవేశించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడాలని సూచించారు.

పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సమ్మిట్ నిర్వహిస్తున్నందున, ఆహ్వానాలు పంపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతినిధులతో అత్యంత మర్యాదగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న అధికారులకు శిక్షణ ఇవ్వాలని అన్నారు.

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, రాష్ట్రానికి చెందిన భౌగోళిక సూచీ (GI) గుర్తింపు ఉన్న ఉత్పత్తులు, చేనేత, రాష్ట్ర అభివృద్ధి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గార్లకు అప్పగించాలని ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సమ్మిట్‌కు ఆహ్వానించాలని సూచించారు.

రక్షా ఎక్స్‌పోలో భాగంగా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం (Armed Forces Flag Day)ను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎయిర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని సూచించారు.

క్లైమేట్ కాంక్లేవ్‌లో భాగంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, వివిధ ప్రపంచ స్థాయి నిపుణులు ప్రసంగించనున్నారు. స్థానికంగా ఉన్న ఇక్రిశాట్ వంటి సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. గ్రీన్ ఎకానమీకి సంబంధించిన పెట్టుబడులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.

ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో భాగంగా యూకే పెవిలియన్, యూరోపియన్ పెవిలియన్‌లతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల ప్రదర్శనలతో పాటు, ఐఎస్‌బీ, ఐఐటీ హైదరాబాద్, నల్సార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల ప్రతినిధులు అంతర్జాతీయ అతిథులతో చర్చలకు వీలుగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

డిసెంబర్ 7న అంతర్జాతీయ విద్యావేత్తలు, నిపుణులతో “Schools of the Future” అనే అంశంపై ప్రత్యేక చర్చలో ముఖ్యమంత్రి గారు పాల్గొంటారు. డిసెంబర్ 8న “Reforms for Educational Institutions” అనే అంశంపై చర్చలో పాల్గొంటారు.

ఇండియా జాయ్ 2026 కాంక్లేవ్‌లో భాగంగా దాదాపు 150 యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో అడోబ్, సోనీ, ఉబిసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.

The Invest Telangana Global Summit 2026 will be organised as a mega multi-sectoral expo spread across nearly 80,000 square metres from December 7 to 9, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said. He directed officials to ensure comprehensive arrangements for the three-day event.

🔹 Minister Duddilla Sridhar Babu, MP Vem Narender Reddy, Chief Secretary Sanjay Jaju, advisors and senior officials participated in the review meeting held at the Bodhi Pavilion, MCRHRD.

🔹 The Chief Minister reviewed the summit arrangements at the Young India Skills University (YISU) campus in Bharat Future City, including the venue, exhibition halls, international invitations and programme schedule.

🔹 He reviewed arrangements for Raksha Expo, India Joy, Startup Pavilion, Pharma and Life Sciences Expo, Agriculture and Allied Sectors Exhibition, Telangana Pavilion, Education Expo and Climate Conclave.

🔹 With over 1,000 companies expected to participate, the Chief Minister directed officials to ensure seamless arrangements, use facial recognition technology for easy entry and train staff to treat delegates with courtesy.

🔹 He emphasised showcasing Telangana’s history, culture, Kakatiya architecture, Sammakka Saralamma temple arch designs, Somashila temple, Nirmal paintings, GI-tagged products, handlooms, development initiatives and future projects, including Gandhi Sarovar.

🔹 Deputy Chief Minister Sri Mallu Bhatti Vikramarka and Ministers Sri Uttam Kumar Reddy and Duddilla Sridhar Babu will oversee invitations to key delegates. The Chief Minister also directed robust security arrangements and suggested inviting Chief Ministers of other States.

🔹 Raksha Expo will feature special programmes on December 7 to mark Armed Forces Flag Day, including an air show. Students from government schools and welfare hostels will be given an opportunity to witness the events.

🔹 The Climate Conclave will feature Sadhguru Jaggi Vasudev, UN representatives and global experts. Scientists, startups and voluntary organisations, including those associated with ICRISAT, will also participate. A roundtable on green economy investments will be held.

🔹 The Education Conclave will feature UK and European Pavilions, Oxford University, ISB, IIT Hyderabad, NALSAR and the University of Hyderabad, providing opportunities for interaction with international delegates.

🔹 The Chief Minister will participate in discussions on “Schools of the Future” on December 7 and “Reforms for Educational Institutions” on December 8, along with international educationists and experts.

🔹 India Joy 2026 will bring together nearly 150 companies from the animation, visual effects, gaming and comics sectors, with leading organisations such as Adobe, Sony and Ubisoft showcasing their work.