Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Launch of Indiramma Family Life Insurance Scheme, Various Development Works, and Addresses a Public Meeting at Siddipet.

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలను రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 నుంచి పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి రోజున ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.

ముఖ్యమంత్రి గారు ప్రజలతో కలిసి ముస్తాబాద్ చౌరస్తా నుంచి 2 కి.మీ మేర పాదయాత్రగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, సిద్దిపేట శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన మదన్ మోహన్ గారు తొలి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

వారి గుర్తుగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ మెడికల్ కాలేజీగా నామకరణం చేయనున్నట్టు ఈ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అందుకు సంబంధించి వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ గారికి సూచించారు.

మల్లన్నసాగర్‌లో ముంపునకు గురైన 14 గ్రామాల్లో నిజమైన లబ్దిదారులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. త్వరలోనే అధికారులు ఇళ్లలోకి వస్తారని, లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు.

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఘాటుగా స్పందించారు. ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ వదులుకోదని స్పష్టం చేశారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, పాలమూరు – రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ, ఖమ్మం జిల్లాకు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు గత పదేళ్లపాటు పడావు పెట్టకుండా పూర్తి చేసి ఉంటే ఈరోజు నీటి కష్టాలు ఉండేవి కాదన్నారు.

1983 నుంచి 2023 వరకు కొనసాగిన ప్రభుత్వాల హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని స్పష్టం చేశారు. పైగా వాటిని మరింత మెరుగ్గా అమలు చేయడమే కాకుండా కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించామని గుర్తుచేశారు.

అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయడం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్లలోపు 50 లక్షల ఇండ్లకు ఉచిత కరెంట్, కొత్తగా రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి గారు వివరించారు.

రుణమాఫీతో పాటు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం రూ. 1.78 లక్షల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపామని చెప్పారు. సంక్షేమ పథకాలే కాకుండా 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన అంశాన్ని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు, శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు, శ్రీ పి. సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ వి. హనుమంతరావు గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు శ్రీ బొమ్మా మహేష్ కుమార్ గారితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy launched the Indiramma Family Life Insurance Scheme, providing Rs. 5 lakh life insurance to every family, and announced the distribution of one crore sarees to women from November 26.

As part of the Praja Palana – Pragathi Baata programme at Siddipet on former PM Indira Gandhi’s birth anniversary, the Chief Minister launched the scheme and paid floral tributes to Indira Gandhi.

Siddipet Medical College will be named after Telangana movement leader Madan Mohan. The Chief Minister also assured compensation to genuine beneficiaries from 14 villages affected by Mallanna Sagar.

Reaffirming Telangana’s water rights, the Chief Minister asserted that the State would not surrender even a single drop of its rightful share.

Highlighting the government’s welfare initiatives, the Chief Minister cited free bus travel for women, free electricity up to 200 units, 8 lakh Indiramma houses, fine rice distribution to 3.48 crore people and ration cards for all eligible families.

The government has spent Rs. 1.78 lakh crore on farmers’ welfare, achieved the No. 1 position in paddy production and filled 75,000 government jobs.

Ministers Sri Damodar Rajanarasimha, Sri Ponnam Prabhakar, Sri Vivek Venkataswamy, Smt. Danasari Anasuya Seethakka, Sri Ponguleti Srinivasa Reddy and Sri Vakiti Srihari; Government Advisors Sri Shabbir Ali, Sri P. Sudarshan Reddy and Sri V. Hanumantha Rao; MLC and TPCC President Sri Bomma Mahesh Kumar, along with several MPs, MLCs, MLAs and other public representatives, participated in the programme.