Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in The Southern Rising Summit 2026 –ABP Network’s Conclave in Hyd.

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకూడదని, రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. కేవలం జనాభా ఆధారంగా 50 శాతం సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రాల జీడీపీ, జనాభా రెండింటినీ పరిగణనలోకి తీసుకుని పునర్విభజన చేపట్టాలని సూచించారు. ఏబీపీ నెట్‌వర్క్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’ మీడియా కాంక్లేవ్‌లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

దేశాభివృద్ధిలో గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన నమూనా, గత నేతల దార్శనికతను ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ప్రతి పేదవాడి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ గారు, జవహర్‌లాల్ నెహ్రూ గారు విశ్వసించారని గుర్తుచేశారు. నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అనేక విద్యాసంస్థలు, నీటిపారుదల ప్రాజెక్టులను ఏర్పాటు చేశారని తెలిపారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత ఆర్థిక విధానాలను మన్మోహన్ సింగ్ గారు కొనసాగించిన తీరును ప్రస్తావిస్తూ, పేదల సంక్షేమం, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా అని పేర్కొన్నారు.

తెలంగాణను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి గారు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న తన దార్శనికతను వెల్లడించారు.

గడిచిన మూడేళ్లలో 65 శాతం కార్యక్రమాలను అమలు చేశామని, మిగిలిన వాటిని వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు కల్పిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని గుర్తుచేశారు.

ఇలాంటి కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగిందని వివరించారు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కళాశాలలు దూరంగా ఉండటంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్న పరిస్థితిని అధిగమించేందుకు ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆనంద్ మహీంద్రా గారి ఛైర్మన్‌షిప్‌లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, పాతకాలపు కోర్సులకు స్వస్తి పలికి ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేస్తున్నామని ప్రస్తావించారు.

ప్రపంచస్థాయి విద్యను తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయని వెల్లడించారు.

విద్యతో పాటు క్రీడారంగ అభివృద్ధికి, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోందని, ఇందులో 8 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు.

ఇప్పటికే ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తెలంగాణకు తీసుకువచ్చామని, పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డోను కూడా రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మెస్సీ తన అభిమాన క్రీడాకారుడని, గతంలో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా కూడా తన అభిమాన ఆటగాడని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

A fair approach to Lok Sabha constituency delimitation must consider states’ economic progress alongside population, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy said. A 50 per cent increase in seats based solely on population could reduce the representation of southern states and enable northern states to dominate the formation of governments at the Centre, he cautioned.

Speaking at ABP Network’s ‘The Southern Rising Summit 2026’ in Hyderabad, the Chief Minister stressed that both GDP and population should be considered in delimitation to ensure fair representation for all states.

Recalling the contributions of Mahatma Gandhi, Pandit Jawaharlal Nehru, former Prime Minister P.V. Narasimha Rao and Dr. Manmohan Singh, Sri Revanth Reddy said the Congress development model focused on poverty alleviation and equal opportunities for all sections of society. He highlighted Nehru’s contributions to education and irrigation, and the economic reforms initiated by P.V. Narasimha Rao and continued by Dr. Manmohan Singh.

The ‘Telangana Rising 2047’ vision aims to make Telangana a leader in India’s economic growth, with projects such as Bharat Future City and AI City. The Chief Minister said 65 per cent of the planned programmes had been implemented in the past three years, with the remaining programmes to be completed in the next two years. He invited global investors and industrialists to the Telangana Global Summit scheduled for December 7–9.

Highlighting education reforms, Sri Revanth Reddy said 27 lakh government school students were being provided breakfast and mid-day meals to improve attendance. Steps were also being taken to bring intermediate education under the School Education Department to reduce student dropouts.

The Chief Minister highlighted the establishment of Young India Skills University under the chairmanship of Anand Mahindra and the transformation of ITIs into Advanced Technology Centres (ATCs) to strengthen skill development and employment opportunities. International universities such as Oxford and Harvard would also establish campuses in Telangana.

On sports development, Sri Revanth Reddy said Telangana was hosting the Khelo India Youth Games, with 8,000 athletes participating. The Chief Minister also spoke about bringing football legend Lionel Messi to Telangana and efforts to invite Cristiano Ronaldo, recalling that Messi and Diego Maradona were among his favourite footballers.