ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మరికొన్ని పనులను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మరికొన్ని పనులను ప్రారంభించారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

శంకుస్థాపనల వివరాలు:

దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఒక్కోచోట రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం.

జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం.

రూ. 13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణం.

చిన్నకోడూరు మండలంలో రూ. 7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ. 7.80 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం.

జనగామ నియోజకవర్గంలో రూ. 6.89 కోట్లతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం.

ప్రారంభోత్సవాల వివరాలు:

సిద్ధిపేట జిల్లాలో రూ. 54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లు.

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ. 14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, రూ. 12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్.

రూ. 6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలు.

రాయపోల్ మండలంలో రూ. 3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం.

గజ్వేల్‌లో రూ. 1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy laid foundation stones for various development works worth Rs. 544.11 crore and inaugurated several completed projects in Siddipet district. The development works were taken up as part of the Praja Palana – Pragathi Baata programme on the birth anniversary of former Prime Minister late Smt. Indira Gandhi.

▶️ Foundation Stone Layings:

Construction of Young India Integrated Residential Schools at a cost of Rs. 200 crore each in Dubbak and Siddipet constituencies.

Construction of additional classrooms in seven government schools across the district at a cost of Rs. 15.44 crore.

Construction of six Tahsildar office buildings at a cost of Rs. 13.50 crore.

Construction of Telangana Public Schools at a cost of Rs. 7.50 crore in Chinnakodur mandal and Rs. 7.80 crore in Doultabad mandal.

Construction of three electricity sub-stations in Jangaon constituency at a cost of Rs. 6.89 crore.

▶️ Inaugurations:

14 electricity sub-stations constructed across Siddipet district at a cost of Rs. 54.67 crore.

A pilgrims’ accommodation facility constructed at Komuravelli Mallanna Temple at a cost of Rs. 14.35 crore and a queue complex built at a cost of Rs. 12 crore.

53 village-level women’s self-help group buildings constructed at a cost of Rs. 6.50 crore.

Kasturba Gandhi Balika Vidyalaya building constructed in Raipole mandal at a cost of Rs. 3.87 crore.

Electricity Department’s Divisional Office constructed in Gajwel at a cost of Rs. 1.59 crore.