Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Inauguration of the Police Station at Bomraspet, Kodangal, Vikarabad District.

వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది గదులను పరిశీలించి, పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

దీపావళి పండుగ శుభసందర్భంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రి దామోదర రాజనర్సింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

The newly constructed Bomraspet Police Station building in Kodangal Assembly Constituency of Vikarabad district was inaugurated by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy. Following the inauguration, he inspected the staff rooms and enquired about various details.

The inauguration ceremony, held on the auspicious occasion of Diwali, was attended by Telangana Legislative Assembly Speaker Sri Gaddam Prasad Kumar, Minister Sri Damodar Rajanarasimha, Sri Tummala Nageswara Rao, Sri Vakiti Srihari, MP Sri Vem Narender Reddy, Government Advisor Sri P. Sudarshan Reddy, public representatives from the erstwhile Mahabubnagar district, the District Superintendent of Police, other officials and police personnel.