దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

డాక్టర్ వైఎస్సార్-డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.
భారతీయ వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు ఈ అవార్డును అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ మల్లికార్జున ఖర్గే, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, శ్రీ వివేక్ వెంకటస్వామి, ఎంపీ శ్రీ జైరాం రమేష్ గారు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ గౌడ్, కేవీపీ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ కేవీపీ రామచందర్ రావు గారితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బతికున్నన్ని రోజులు రైతుల కోసం పరితపించిన డాక్టర్ వైఎస్సార్‌ను మనమంతా గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారు నిర్వాహకులను అభినందించారు. తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వైఎస్సార్ ఆశయమైన ప్రాణహిత, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు.
నిరుపేదలు, రైతుల కష్టాలను తెలుసుకోవడానికి 2003లో ఎర్రటి ఎండలో ప్రజాప్రస్థానం పేరిట డాక్టర్ వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రను ముఖ్యమంత్రి గారు గుర్తుచేస్తూ, రైతుల ఆత్మగౌరవం పెంచడానికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అన్నారు.
అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్సార్ అని గుర్తుచేశారు. ఆనాడు రూ. 1300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయడం, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం వంటి చర్యలతో డాక్టర్ వైఎస్సార్ రైతుల గుండెల్లో రారాజుగా నిలిచారని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్సార్ చివరి కోరిక నెరవేర్చడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ నిరుపేదలకు కనీసం ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రజా పంపిణీ (PDS) విధానాన్ని తీసుకొచ్చి పేదవారికి బియ్యం, గోధుమలు, ఇతర వస్తువులను అందించారని, ఈరోజు తెలంగాణలో 3.40 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామంటే ఆనాడు కాంగ్రెస్ ప్రారంభించిన పీడీఎస్ విధానం వల్లే సాధ్యమైందని ముఖ్యమంత్రి గారు వివరించారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy has made it clear that the government will complete and dedicate to society the Pranahita–Chevella, SLBC, and Kalwakurthy Lift Irrigation Projects, which were the vision of the late great leader Dr. Y. S. Rajasekhara Reddy, with the aim of making Telangana lush and prosperous.
The Chief Minister participated and addressed the gathering at the Dr. Y. S. Rajasekhara Reddy Award 2026 ceremony, organized by the Dr. YSR and Dr. KVP Foundation at the Constitution Club in New Delhi. The award was presented to the M. S. Swaminathan Foundation in recognition of its outstanding contribution to the agricultural sector.
The programme was attended by Leader of the Opposition in the Rajya Sabha Sri Mallikarjun Kharge, Deputy Chief Minister Sri Mallu Bhatti Vikramarka, Ministers Sri N. Uttam Kumar Reddy, Sri Duddilla Sridhar Babu, Sri Tummala Nageswara Rao, Sri Vivek Venkataswamy, MP Sri Jairam Ramesh, MLC Sri Bomma Mahesh Goud, and other public representatives.
The Chief Minister congratulated the organizers for conducting this meaningful programme to remember Dr. YSR, who was deeply committed to the welfare of farmers. He announced that the Pranahita, SLBC, and Kalwakurthy projects, envisioned by YSR, would be completed and dedicated to the people of Telangana to provide irrigation to 16 lakh acres in the state.
