తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహన్ నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని తెలిపారు.

ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.
ఆదిలాబాద్‌లో రన్‌వే ఫైనలైజ్ చేయడానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు.
మామునూరు (వరంగల్) విమానాశ్రయం టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు.
తెలంగాణలో చాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని రామ్మోహన్ నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో సీ-ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రి గారికి తెలిపారు.
ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, సురేశ్ షెట్కార్ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల రావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Expediting the construction of Adilabad and Mamunur (Warangal) airports was discussed during a meeting between Hon’ble Chief Minister Sri A. Revanth Reddy and Hon’ble Union Civil Aviation Minister Sri K. Ram Mohan Naidu in New Delhi. The Chief Minister informed that the required land acquisition for Mamunur Airport has been completed and handed over.
The Chief Minister sought Cargo, Passenger Terminal and MRO facilities at Adilabad Airport and a joint meeting of the Defence and Civil Aviation Ministries to finalise the runway.
The Union Minister informed that tenders for Mamunur Airport would be invited within two weeks, finalised by December and foundation works taken up in the same month.
The meeting also discussed heli-tourism in Telangana and the proposed sea-plane landing facility at Hussain Sagar. Civil Aviation officials said the report would be submitted to the State Government within two weeks.
MPs Anil Kumar Yadav and Suresh Shetkar, State Government Advisor (Protocol) Harkara Venugopala Rao, Chief Secretary Sanjay Jaju, CM Secretary Manik Raj and senior officials participated.
