హైదరాబాద్ మూసీ నదిపై అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో కొత్తగా నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.

400 మీటర్ల పొడవైన ముసారాంబాగ్ బ్రిడ్జిని రూ. 52 కోట్లతో నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వీ హనుమంత రావు గారు, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, మల్‌రెడ్డి రంగారెడ్డి గారు, శ్రీగణేష్ గారు, నవీన్ యాదవ్ గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated the newly constructed Moosarambagh High-Level Bridge across the Musi River in Hyderabad, connecting Amberpet and Dilsukhnagar. The Chief Minister inspected the bridge along with public representatives and viewed the photo exhibition arranged by officials on the bridge project.
The 400-metre-long Moosarambagh Bridge was constructed at a cost of ₹52 crore. Government Advisor Sri V. Hanumantha Rao, Members of Parliament Sri Anil Kumar Yadav and Sri Asaduddin Owaisi, MLAs Sri Kaleru Venkatesh, Sri Mal Reddy Ranga Reddy, Sri Ganesh and Sri Naveen Yadav, along with other public representatives and officials, participated in the inauguration programme.
