క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాజెక్టులపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్షించారు.
మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతిని ముఖ్యమంత్రి గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్-1లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
జనవరి 2027 లో ఫేజ్-1 పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు. జనవరి 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు అధికారులు తెలిపారు. మిరాలం చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని ఆదేశించారు.
రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ రోడ్ల కోసం భూసేకరణ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనులు మార్చి 2027 నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో PRTS (Personal Rapid Transit System) ఫేజ్-1 కు సంబంధించి టెక్నో-ఎకానమీ ఫీజిబిలిటీని, కూకట్పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు అలైన్మెంట్ సాధ్యాసాధ్యాలను అధికారులు వివరించారు.
బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు అలైన్మెంట్ ప్రతిపాదనల గురించి అధికారులు వివరించారు. దీంతో పాటు నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో PRTS డిపోలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు.
డిపో పరిసరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఉండేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. రూట్స్, డిపోల నిర్మాణం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో IIIT జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించి డిజైన్లను ముఖ్యమంత్రి గారు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో ప్రధానంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధి పనులతో మెరుగైన రవాణా సౌకర్యం కోసం సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటు ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ వివరించారు. నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, హెచ్ఎండీఏ, హైడ్రా, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, ఎఫ్‌సీడీఏ కమిషనర్లు, HMWSSB ఎండీ, MRDCL ఎండీ, HGCL ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy directed officials to speed up various development works in the CURE and PURE regions under the Municipal Administration and Urban Development Department. He reviewed the progress of ongoing projects and gave instructions to officials at a meeting held at the Bodhi Pavilion in MCRHRD.
Officials briefed the Chief Minister on Phase-1 of the Musi Rejuvenation Project, covering 9.20 km from Himayatsagar to Gandhi Sarovar (Zone-1A) and 11.8 km from Osmansagar to Gandhi Sarovar (Zone-1B). Preparations are underway to commence works in January 2027, with the tender process already initiated.
Reviewing Mir Alam Tank development, targeted for completion by January 2028, he directed officials to remove accumulated silt. He also instructed them to speed up radial road construction and land acquisition, and complete the modern goshala at Gandipet by March 2027.
Officials explained the techno-economic feasibility and proposed alignments of Phase-1 of Hyderabad’s Personal Rapid Transit System (PRTS), from Kukatpally to Biodiversity via Raidurg and from Begumpet Metro Station to Ranigunj via the Secretariat and Basheerbagh. The Chief Minister directed officials to identify suitable sites around Necklace Road, Raidurg and People’s Plaza for PRTS depots, study their feasibility and plan multi-level parking facilities. He asked officials to prepare plans after a comprehensive study of routes, depot construction and other aspects.
The Chief Minister examined the designs of the foot overbridge at IIIT Junction in Cyberabad and suggested setting up multi-level car parking near the bridge.
He directed officials to speed up the Integrated Fruit Market works at Koheda, ensure quality and complete connecting roads simultaneously for better transport facilities.
The HYDRAA Commissioner briefed him on proposals to establish STPs wherever necessary as part of lake restoration in the CURE region. The Chief Minister also directed officials to take necessary steps to restore stepwells across the city.
Chief Secretary Sri Sanjay Jaju, CMO officials, Commissioners of HMDA, HYDRAA, GHMC, CMC, MMC and FCDA, Managing Directors of HMWSSB, MRDCL and HGCL, Rangareddy District Collector and other senior officials participated in the review.
