Hon’ble CM Sri A. Revanth Reddy Participates in the Inauguration of Government Junior College at Bomraspet, Kodangal, Vikarabad District

వికారాబాద్ జిల్లా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం కళాశాల తరగతి గదులు, సిబ్బంది గదులను పరిశీలించారు.

 

దీపావళి పండుగ రోజున జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వాకిటి శ్రీహరి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated the newly constructed Government Junior College building at Bomraspet in Kodangal Assembly Constituency of Vikarabad district. He later inspected the college classrooms and staff rooms.

The inauguration ceremony, held on the occasion of Diwali, was attended by Telangana Legislative Assembly Speaker Sri Gaddam Prasad Kumar, Ministers Sri Damodar Rajanarasimha, Sri Tummala Nageswara Rao and Sri Vakiti Srihari, MP Sri Vem Narender Reddy, Government Advisor Sri P. Sudarshan Reddy, other public representatives, villagers and students.