Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of Mega Rythu Mela & Industrial Expo, Visits Stalls and Interacts with Progressive Farmers and Agricultural Scientists at Hakeempet, Kodangal, Vikarabad Dist.

రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆధునిక పరికరాలు, పనిముట్లు, ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఉత్పత్తులతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులు, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన వనరులు, వ్యవసాయ ఆధారిత ఇతర పారిశ్రామిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రదర్శించారు.

మెగా రైతు మేళా ప్రారంభోత్సవంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, తుమ్మల నాగేశ్వర రావు గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వాకిటి శ్రీహరి గారు, ఎంపీలు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులతో కలిసి స్టాళ్లను పరిశీలించారు. ఆయా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులందరూ ఈ మేళాలోని స్టాళ్లను సందర్శించి వ్యవసాయ రంగంలో ఆధునిక మెళకువలను తెలుసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inaugurated the Mega Rythu Mela and Industrial Exhibition organised by the State Government at Hakeempet in Kodangal constituency of Vikarabad district.

The exhibition features stalls showcasing agricultural products, modern equipment, tools, products from agro-based industries, industrial products, aerospace and defence technologies, green technology, renewable energy sources and other technologies related to the agricultural sector.

Assembly Speaker Gaddam Prasad Kumar, Ministers Damodar Rajanarasimha, Tummala Nageswara Rao, Duddilla Sridhar Babu and Vakiti Srihari, MPs, Agriculture Commission Chairman Kodanda Reddy, other public representatives and officials attended the inaugural programme.

The Chief Minister, along with his Cabinet colleagues, visited the stalls and enquired about the products on display. He urged farmers to visit the exhibition stalls and learn about modern agricultural practices.