Hon’ble CM Sri A. Revanth Reddy invited Hon’ble Maharashtra CM Sri Devendra Fadnavis to participate in the Invest Telangana Global Summit.

హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవంద్ర ఫడ్నవీస్ గారిని ఆహ్వానించారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి జరిగిన సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలియజేస్తూ పాల్గొనాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అహ్వానించారు. అందుకు ఫడ్నవీస్ గారు సానుకూలంగా స్పందించారు. ఆ సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తి ఉందని, హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy invited Hon’ble Maharashtra Chief Minister Sri Devendra Fadnavis to participate in the Invest Telangana Global Summit, scheduled for December 7, 8 and 9 at Bharat Future City, Hyderabad. Following the meeting on the Tummidihatti Barrage, Sri Fadnavis ji responded positively to the invitation and expressed his willingness to make efforts to attend the summit.