ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకున్నాయి.

హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్ కు సహకారం అందిస్తాయి.
నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ సంస్థ సీఎండీ శేఖర్ రెడ్డి గారు, సీఈఓ అనిల్ బాబు గారితో కలిసి రూ. 5.17 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.
వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థ ప్రతినిధి డి. సుమంత్ గారు, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రూ. 4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.
ఒక మంచి కార్యక్రమానికి నిధులు అందించి సహకరించడానికి ముందుకు వచ్చిన సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారు, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ గారితో పాటు ఇతర ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వచ్చే డిసెంబర్ 9 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సెంట్రలైజ్డ్ కిచెన్లను ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. నవంబర్ 30వ తేదీలోగా ఈ కిచెన్ల ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు.
ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని, విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఆహారంలో ఇచ్చే పదార్థాల కేలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలని చెప్పారు.
బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్‌ను అందించే విధంగా చూడాలని, జీవితకాలం కొనసాగించాల్సిన ఈ కార్యక్రమం కాబట్టి సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు.
The breakfast scheme for students in government schools is being supported through modern centralized community kitchens, with Junna Solar Systems and Chain Labs India entering into agreements with the Hare Krishna Foundation in the presence of Hon’ble Chief Minister Sri A. Revanth Reddy.
Junna Solar Systems provided ₹5.17 crore for the Nagarkurnool kitchen, while Chain Labs India provided ₹4 crore for the Vikarabad kitchen. The Hon’ble Chief Minister appreciated the companies for their support and directed officials to complete the kitchens by November 30 and launch centralized kitchens across the State on December 9.
He also directed officials to facilitate student visits to the kitchens, track students’ physical and academic progress, monitor food calories through apps, ensure continuous food-quality checks, provide region-specific breakfast menus, and connect the kitchens to the Command Control Centre.
The programme was attended by Minister Ponguleti Srinivas Reddy, Rajya Sabha Member Vem Narender Reddy, Hare Krishna representative Satya Gaura Chandra Das Swamiji, other representatives and senior officials.
