Hon’ble CM Sri A. Revanth Reddy along with Hon’ble Leader of Opposition in Lok Sabha Sri Rahul Gandhi Participates in Valedictory Session of BHARAT SUMMIT 2026 at HICC, Madhapur, Hyd.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై కలిసికట్టుగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజల్లో వ్యక్తమవుతున్న కలలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని, వాటిని నెరవేర్చడానికి మనమంతా చేతులు కలపాలని ప్రజాస్వామ్యవాదులను కోరారు.

హైదరాబాద్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగిన భారత్ సమ్మిట్-2026 ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి గారు Delivering Global Justice అన్న అంశంపై ప్రసంగించారు.

జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆలోచనా ధోరణి కలిగిన ప్రతినిధులు, ప్రభావశీలురను ఒకచోటికి తీసుకురావడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదికగా నిలుస్తోందని అన్నారు.

“ప్రస్తుతం ప్రపంచంలో ప్రధానంగా రెండు శక్తుల మధ్య పోరాటం సాగుతోంది. ఒక శక్తి ప్రజాస్వామ్య పరిరక్షణను కోరుకుంటే మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తోంది. రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి మనముంటే, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి నియంతృత్వాన్ని రుద్దాలని ఆ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

ప్రతి పౌరుడికి ఓటుహక్కు ఉండాలని కోరుకుంటే, నియంతృత్వ శక్తులు తమకు నచ్చిన కొన్ని వర్గాలకే ఆ హక్కు కల్పించాలని భావిస్తున్నాయి. మనమంతా పర్యావరణ పరిరక్షణ కోరుకుంటే, ఆ శక్తులు పర్యావరణ వినాశనాన్ని కోరుకుంటున్నాయి.

పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని మనమంతా భావిస్తుంటే, వాళ్లు మిలియనీర్ మిత్రులను కాపాడుకోవాలన్న తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు కాకుండా అధికారం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావాలని ఆశిస్తున్నారు.

ఏకపార్టీ, ఏకవ్యక్తి పాలనకు వ్యతిరేకంగా మనమంతా చర్చలు, సంప్రదింపుల పట్ల విశ్వాసంతో పనిచేస్తున్నాం. ఈ పోరాటంలో మనల్ని నిరంతరం నిరోధించాలని భావిస్తున్నారు. మనమంతా ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నందున ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని నిలువరించలేదు.

ప్రపంచీకరణ, కోవిడ్ మహమ్మారి అనంతర పరిణామాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వ్యక్తుల ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్య సేవలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి.

ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజల కలలు, ఆకాంక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు తమ ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, వారి సమస్యలను వినాలని, వారి కలలను సాకారం చేయాలని ఆశాభావంతో ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో మనపై ఎంతో బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తాం. సంపన్నుల కోసం పనిచేయడం మానుకోవాలి. ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం పనిచేయాలి” అని ముఖ్యమంత్రి గారు ఉద్ఘాటించారు.

“ఈ సదస్సుకు 70 దేశాల నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానించాం. కేంద్ర ప్రభుత్వం కొందరికి వీసాలను నిరాకరించింది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారంతా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని విశ్వసిస్తున్నాం.

భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి రోజున ఈ సమ్మిట్ నిర్వహించుకోవడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ గారి దార్శనికత ఎంతో దోహదపడింది” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.

Democratic forces across the world must unite and fight collectively to fulfil people’s aspirations, said Hon’ble Chief Minister Sri A. Revanth Reddy. He called on them to understand people’s dreams and aspirations and work together to realise them.

Addressing the valedictory session of the two-day Bharat Summit 2026 at HICC, Hyderabad, on the theme ‘Delivering Global Justice’, the Chief Minister said the summit had emerged as a platform to bring together like-minded representatives and influential personalities from across the world.

“The world is witnessing a struggle between two forces — one seeking to protect democracy and the other attempting to destroy it. While we stand for the Constitution, rule of law, voting rights, environmental protection and equal opportunities, authoritarian forces seek to impose dictatorship and concentrate power in the hands of a few.

“Countries across the world face similar challenges, including attacks on fundamental rights, issues relating to education, employment and healthcare, and inflation. Millions of people want their aspirations to be understood, their problems heard and their dreams fulfilled.

“We have a great responsibility. If we fight together, we will succeed. We must stop working for the wealthy. Governments must work for ordinary people,” the Chief Minister emphasised.

The Chief Minister said that over 1,000 delegates from 70 countries had been invited to the summit, though the Central Government denied visas to some. He expressed confidence that people across the world were watching the event.

He also noted that holding the summit on the birth anniversary of India’s first Prime Minister, Pandit Jawaharlal Nehru, was particularly significant, recalling Nehru’s contribution to strengthening constitutional democracy in the country.