తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, రాష్ట్రంలో విధానపరమైన గందరగోళం లేదని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. తెలంగాణకు పాలసీ పెరాలసిస్ లేదని, పెట్టుబడులకు అవసరమైన భూములు, నీళ్లు, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించామని చెప్పారు.

విద్య, వైద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో ఐఎస్బీ, నల్సార్ వంటి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
హైదరాబాద్ లో నెలకొల్పనున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ (PHFI) శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, పీహెచ్ఎఫ్ఐ 2 జూన్ 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభించాలని చెప్పారు. అందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
పీహెచ్ఎఫ్ఐ హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించడమే కాకుండా, తాను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ప్రకటించారు.
వైద్య రంగంలో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు పీహెచ్ఎఫ్ఐ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించుకున్నామని, మిగతా టిమ్స్ ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తున్నామని, ఆస్పత్రుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దేశంతో పాటు మధ్యప్రాచ్య, ఆసియా దేశాలు కూడా పెట్టుబడుల కోసం హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెప్పారు.
జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా విద్య, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని చెబుతూ, ఆ కాలంలో నెలకొల్పిన ప్రఖ్యాత సంస్థలు, ప్రాజెక్టుల గురించి వివరించారు. వాటి కారణంగానే దేశంలో దేశం ఆహార కొరత నుంచి మిగులు ఆహార ధాన్యాల స్థాయికి చేరుకుందని చెప్పారు.
తెలంగాణలోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి కూడా న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేసే వారితో పోటీపడే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.
పెట్టుబడిదారులు, విద్యాసంస్థల విషయంలో తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని, ఇక్కడే అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి వస్తోందని చెప్పారు.
తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను రూపొందించామని గుర్తుచేశారు. క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలు ఎలాంటి సందేహాలు లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చని భరోసా ఇచ్చారు.
1960వ దశకంలో నెహ్రూ, ఇందిరాగాంధీ చొరవతో హైదరాబాద్‌లో ఐడీపీఎల్ ఏర్పాటు కావడం వల్లే రాష్ట్రంలో ఫార్మా రంగానికి పునాదులు పడ్డాయని గుర్తుచేశారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హైదరాబాద్ ఫార్మా రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిందన్నారు.
దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోందని చెప్పారు. అనేక అంతర్జాతీయ సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.
ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి, రాష్ట్రంలో రోగుల వివరాలను సేకరించామని చెప్పారు. తెలంగాణ డేటా రిచ్ స్టేట్ అని, ఆరోగ్యశ్రీ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చని వివరించారు.
ఫ్లోరైడ్ సమస్యతో పాటు మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే మూసీ శుద్ధి తప్పనిసరని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పీహెచ్ఎఫ్ఐ చాన్సలర్ డాక్టర్ కె శ్రీనాధ్ రెడ్డి గారు, ప్రో-చాన్సెలర్ ప్రొఫెసర్ సంజయ్ జోడ్పే గారు, అఫీషియేటింగ్ వీసీ డాక్టర్ ఎం విష్ణువర్ధన్ రావు గారు, పారిశ్రామిక వేత్త శ్రీని రాజు గారు, పీహెచ్ఎఫ్ఐ చైర్మన్ రజత్ గుప్తా గారు, బోర్డు మెంబర్ మధుమోహన్ గారితో పాటు పలువురు వైద్యనిపుణులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
The Telangana Government will extend full support to investors, with no policy paralysis or uncertainty in the State, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy stated. Dedicated policies are in place to provide land, water, permissions and infrastructure for investments.
Telangana aims to achieve global standards in education, healthcare, industries and services. Institutions such as ISB and NALSAR have contributed to Hyderabad’s global recognition.
Speaking at the foundation stone-laying ceremony of the Institute of Public Health Sciences (PHFI) in Hyderabad, the Chief Minister called for the campus to be completed by June 2, 2028, assuring full government support. He said he would personally serve as its brand ambassador.
The government is spending Rs. 12,000 crore on healthcare infrastructure. Sanathnagar TIMS has been inaugurated, the remaining TIMS hospitals are being developed, and a new Osmania General Hospital is coming up at Goshamahal.
Recalling Nehru’s focus on education and irrigation, the Chief Minister said institutions and projects established during that period helped India move from food scarcity to surplus production. He wants students from remote Telangana villages to compete at global levels.
Under Telangana Rising 2047, the State’s development plan is structured around CURE, PURE and RARE zones. The Invest Telangana Global Summit will be held on December 7, 8 and 9 to attract investments. Global universities are also setting up centres in Hyderabad.
Recalling the establishment of IDPL in Hyderabad in the 1960s, he said it laid the foundation for the pharma sector. Hyderabad accounts for 40 per cent of India’s bulk drug production. Eli Lilly is coming forward with a proposed one-billion-dollar investment, while global companies are establishing Global Capability Centres in the city.
The government spends around Rs. 2,500 crore annually through Aarogyasri and CMRF. Cancer has been declared a notifiable disease to collect patient data. Analysis of Aarogyasri data would help identify region-specific health issues.
Expressing concern over fluoride and Musi pollution affecting Nalgonda, the Chief Minister stressed the need to clean and rejuvenate the Musi to protect public health.
PHFI Chancellor Dr. K. Srinath Reddy, Pro-Chancellor Prof. Sanjay Zodpey, Officiating Vice-Chancellor Dr. M. Vishnuvardhan Rao, industrialist Srini Raju, PHFI Chairman Rajat Gupta, Board Member Madhumohan, medical experts and industrialists attended the programme.

