ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లలో అశేష జనసందోహం మధ్య పట్టణంలోని వీధుల మీదుగా పాదయాత్ర చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ దాదాపు 3 కి.మీ.లకు పైగా ఈ పాదయాత్ర సాగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రగుడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వరకు అశేషంగా తరలివచ్చిన ప్రజలతో కలిసి నడిచారు.
సిరిసిల్ల పట్టణం నడి వీధుల నుంచి సాగిన ఈ పాదయాత్రలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
As part of the Praja Palana – Pragathi Bata programme, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy took a padayatra through the streets of Sircilla amid a large gathering of people. Greeting the public, the padayatra covered nearly 3 km, from Dr. B.R. Ambedkar Chowrastha to the public meeting venue at Ragudu.
Ministers Duddilla Sridhar Babu, Ponnam Prabhakar, Ponguleti Srinivas Reddy, Adluri Laxman Kumar, Government Whip Aadi Srinivas, MP Vem Narender Reddy, MLC and TPCC President Bomma Mahesh Kumar Goud, along with a large number of public representatives, participated in the padayatra.
