ఓటర్ల జాబితా సవరణ SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షించబడేలా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పరిపాలించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని అన్నారు.

దేశంలో జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్యలో తగ్గుదల ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, అర్హతల నిర్ధారణ వంటి ప్రక్రియలు స్పష్టంగా, ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చర్యలు ఉండాలని పేర్కొన్నారు.
అసోం దినపత్రిక ‘ప్రతిదిన్’ మీడియా నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ‘India’s Next Chapter’ అంశంపై జరిగిన చర్చలో దేశ భవిష్యత్ దిశ, విద్య, నైపుణ్యాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన SIR తదితర అంశాలపై ముఖ్యమంత్రి గారు విస్తృతంగా మాట్లాడారు.
దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఉన్న సామర్థ్యాన్ని అక్కడి స్థానిక వనరులు, మానవ వనరులతోనే అభివృద్ధి చేసే విధంగా కేంద్రం ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు వంటి కేంద్రం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 1976లో నియోజకవర్గాల సంఖ్యను స్థిరీకరించిన నిర్ణయం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే పరిస్థితి రాకూడదని అన్నారు.
దేశ రాజకీయాల్లో సంఖ్యాబలం కీలకమని, లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే జాతీయ విధానాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాల వాదన బలహీనపడుతుందని విశ్లేషించారు.
తెలంగాణను.. విద్య, నైపుణ్యాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల ఆధారంగా అభివృద్ధి చేసి, దేశ ప్రగతిలో రాష్ట్రాన్ని కీలక భాగస్వామిగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి గారు తెలిపారు. యువతకు విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నర్సరీ విద్య వంటి అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేలా విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు భాష, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని, 12వ తరగతి తర్వాత విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
Protecting the rights of every eligible voter must be ensured during the Special Intensive Revision (SIR) of electoral rolls, said Hon’ble Chief Minister Sri A. Revanth Reddy. The people decide who governs in a democracy, and the right to vote is a cornerstone of democracy.
Questioning the decline in voter numbers despite a rise in population, the Hon’ble Chief Minister called for transparent procedures for deletion of names and verification of eligibility, leaving no room for doubts.
Speaking at ‘The Conclave 2026’ in New Delhi on ‘India’s Next Chapter’, the Hon’ble Chief Minister discussed India’s future, education, skills, Telangana’s development, Metro expansion, Regional Ring Road, delimitation and SIR.
Equal opportunities must be ensured for all states. Adequate Central support for Telangana’s pending projects, including Metro expansion, Regional Ring Road and national highways, would accelerate the State’s development.
On delimitation, the Hon’ble Chief Minister stressed that southern states that successfully implemented population control should not face political disadvantage. Any reduction in their Lok Sabha representation could weaken their voice in national policy-making.
The government’s goal is to make Telangana a key partner in India’s progress through education, skills, investments and infrastructure, with greater focus on language, communication and skill development.
Education reforms, including English-medium and nursery education in government schools, are being taken up based on public feedback, with a focus on proficiency in both regional languages and English.
