విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు విషయంలో తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గారితో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి సూచించారు.

 

విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. యాదాద్రి థర్మల్ కేంద్రంలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడంపై ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు.

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి G-9 గ్రేడ్ బొగ్గు అవసరమని అధికారులు వివరించారు. సింగరేణిలో జీ 9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ 9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

జీ 9 గ్రేడ్‌ బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతపై ఆధారపడిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎలా నిర్మించారని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అధికారులను ప్రశ్నించారు. పిట్ హెడ్ (బొగ్గు గనుల పైనే విద్యుత్ కేంద్ర నిర్మాణం) కాకుండా, యాదాద్రి థర్మల్ కేంద్రాన్ని ఎందుకు దూరంగా నిర్మించారని అడిగారు. ఈ కేంద్రానికి బొగ్గు సరఫరా చేయడం వల్ల రాష్ట్రంపై పడే అదనపు భారం ఎంత అని అధికారులను ప్రశ్నించారు.

అప్పట్లో రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్‌పై కాకుండా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం దూరంగా నిర్మించారని అధికారులు తెలిపారు. యాదాద్రికి బొగ్గు సరఫరాతో తెలంగాణ రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు.

సింగరేణి నుంచి జీ-9 గ్రేడ్ బొగ్గుకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో జీ-9 గ్రేడ్ బొగ్గును సింగరేణి నుంచి సరఫరా చేయలేదని అధికారులు వివరణ ఇచ్చారు.

సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని సమావేశంలో అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ అవసరాల దృష్ట్యా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

ఎత్తిపోతల పథకాల పంపులకు విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పారు. అన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రోంలో ప్రస్తుత అవసరాలకు తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజయ్ జాజు గారు, సీఎం స‌ల‌హాదారు కె. రామకృష్ణారావు గారితో పాటు ఇంధన శాఖ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సింగరేణి కాలరీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Full-scale power generation at the Yadadri Thermal Power Plant must commence before Dasara, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy directed officials during a high-level review of the Energy Department held with Hon’ble Deputy Chief Minister Sri Mallu Bhatti Vikramarka.

Officials informed the meeting that the plant requires G-9 grade coal, which is neither available in Singareni nor likely to be produced there in the near future. The Chief Minister and Deputy Chief Minister questioned the plant’s dependence on G-9 coal and its construction away from coal mines instead of a pit-head location.

The meeting was informed that transporting coal to Yadadri is placing an additional burden of nearly ₹40,000 crore on the State. It was also noted that Singareni could not supply G-9 coal as earlier coal block auctions were not pursued and that 14 coal blocks have already been closed.

Deputy Chief Minister Mallu Bhatti Vikramarka was asked to immediately discuss G-9 coal availability with Union Coal Minister G. Kishan Reddy, while officials were directed to initiate coal procurement from Mahanadi Coalfields and Coal India.

The meeting also reviewed measures to ensure uninterrupted power supply to lift irrigation schemes, full-capacity generation from all thermal power stations and procurement of power as required to meet the State’s needs.