నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు.
ముఖ్యమంత్రి గారు మద్దూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలేజీ డిజైన్లు, లేఅవుట్ను పరిశీలించి పలు మార్పులను సూచించారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు జరగాలని, కళాశాల చుట్టూ ప్రహారీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణా పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. స్థానికులను పలకరిస్తూ, వారితో కరచాలనం చేశారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy directed officials to expedite the construction works of the Government Degree College in Maddur, Narayanpet district. He instructed them to complete the construction of the building within the stipulated timeframe.
The Chief Minister inspected the ongoing construction works of the Government Degree College in Maddur at the field level, along with public representatives and officials. He reviewed the college designs and layout and suggested several changes.
He directed that the construction be undertaken keeping future requirements in mind and instructed officials to construct a compound wall around the college. He emphasised that there should be no compromise on quality in the construction works. He also interacted with local residents and shook hands with them.

