నారాయణపేట్ జిల్లా మద్దూరులో ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పనులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. పదేళ్ల కిందట ప్రజల అవసరాల కోసం సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిని ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించగా, ఆ స్థలంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని చేపట్టారు.
జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి గారు పాఠశాల నిర్మాణ ప్రణాళికలను పరిశీలించి ప్రాంగణమంతా కలియతిరిగారు. స్థానికులందరితో మాట్లాడి వారి నుంచి విజ్ఞాపనలను తీసుకున్నారు.
గతంలో భూమి కొనుగోలు చేసిన సందర్భంగా భూములిచ్చిన రైతులను గుర్తించి ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడారు. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy inspected the construction works of the newly established Social Welfare Residential School being built by the government in Maddur of Narayanpet district.
Ten years ago, land was purchased with personal funds for the needs of the people and was subsequently handed over to the government. The construction of the Social Welfare Residential School was then taken up on the said land.
As part of his district tour, the Hon’ble Chief Minister visited the site, reviewed the plans for the construction of the school and inspected the entire premises. He interacted with the local residents and received their representations.
The Hon’ble Chief Minister also identified and interacted with the farmers who had given their lands when the land was purchased earlier. On this occasion, he directed the officials to sanction Indiramma houses for every family.
