అంగరంగ వైభవంగా సాగుతున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారు, పలువురు ప్రజాప్రతినిధులు లష్కర్ బోనాల జాతరలో పాల్గొన్నారు.
On the auspicious occasion of the Sri Ujjaini Mahankali Ammavari Bonalu festivities in Secunderabad, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy offered special prayers to the Goddess. Along with the Ministers, the Chief Minister presented Bonam and silk robes to the Goddess on behalf of the State Government.
Ministers Smt. Konda Surekha, Sri Ponnam Prabhakar, Smt. Danasari Anasuya Seethakka and several public representatives participated in the Lashkar Bonalu celebrations.

