పంట మార్పిడి విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి నివేదికను సమర్పించింది.

పంట మార్పిడి విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి నివేదికను సమర్పించింది. కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి గారి నేతృత్వంలో సభ్యులు జూబ్లీ హిల్స్‌లో ముఖ్యమంత్రి గారిని కలిసి నివేదిక అందజేశారు.

✳️ పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించడం, లాభదాయక వ్యవసాయ విధానాలపై ప్రభుత్వం సమగ్రమైన చర్చ జరపాలని భావిస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. పంట మార్పిడి విధానాలపై శాసనసభలో ప్రత్యేకంగా చర్చ చేపట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు.

✳️ పంట మార్పిడిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కమిషన్‌ను కోరారు. ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు, రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్ గారు, సునీల్ గారు, రాంగోపాల్ రెడ్డి గారు, జి.గంగాధర్ గారు, కేవీ నర్సింహా రెడ్డి గారు, సీహెచ్ వెంకన్న యాదవ్ గారు, ఎం. భవాని గారు ఉన్నారు.

The Telangana State Agriculture and Farmers Welfare Commission (Rythu Commission) has submitted a comprehensive report on crop diversification strategies to Hon’ble Chief Minister Shri A. Revanth Reddy. Led by Commission Chairman M. Kodanda Reddy, the delegation met with the Chief Minister at his Jubilee Hills residence to formally present their findings and recommendations.

🔹 During the meeting, Chief Minister emphasized that the state government intends to initiate a robust dialogue on sustainable and profitable agricultural practices to enhance farmer awareness regarding crop rotation. He further announced that a dedicated discussion on crop diversification policies will be held in the Legislative Assembly to gather diverse perspectives and build a consensus on the way forward.

🔹 The Chief Minister urged the Commission to conduct deeper research and provide constructive, actionable suggestions to strengthen the sector, in a meeting attended by Minister Shri Vakiti Srihari Garu and Rythu Commission members Shri Ramulu Naik Garu, Shri Sunil Garu, Shri Ramgopal Reddy Garu, Shri G. Gangadhar Garu, Shri KV Narasimha Reddy Garu, Shri CH Venkanna Yadav Garu, and Smt. M. Bhavani Garu.