దీపావళి పండుగ సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి కార్యక్రమంలో పాల్గొనాలని సమావేశంలో నిర్ణయించారు.
నవంబర్ 19న మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.
అలాగే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలని మంత్రిమండలి తీర్మానించింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా వర్తింపజేసే ఈ పథకం కోసం నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో దరఖాస్తులను సేకరిస్తారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్, 2003ను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపింది.
ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉండే విధంగా వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రివర్గం భావించింది.
తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్, 1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రమాదాలకు గల కారణాలను గుర్తించడం, వాటిపై వేగంగా స్పందించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది.
ఇళ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరుస్తారు.
తెలంగాణ సర్వే మరియు సరిహద్దుల చట్టం, 1923లోని సెక్షన్ 12 (ఏ) సవరణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వాకిటి శ్రీహరి గారితో మంత్రిమండలి సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు.
The Telangana Cabinet, chaired by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, has taken key decisions to organise the ‘Mana Indiramma Intlo Deepavali’ programme across the State, launch the Indiramma Family Life Insurance Scheme and establish separate commissions for SCs and STs. The decisions were taken at a Cabinet meeting held at the Dr. B.R. Ambedkar Telangana State Secretariat.
With 2,25,000 Indiramma houses already completed, Ministers and MLAs will celebrate Deepavali with beneficiaries in their respective constituencies.
A grand public meeting will be held in Siddipet on November 19 to mark the birth anniversary of former Prime Minister Smt. Indira Gandhi and launch the distribution of Indiramma sarees.
The Cabinet decided to launch the Indiramma Family Life Insurance Scheme, providing ₹5 lakh life insurance coverage to every family in the State. Applications will be collected in villages from November 20 to 30.
The existing combined SC and ST Commission will be abolished and separate commissions established for both communities. The Cabinet approved the repeal of the Telangana State Commission for Scheduled Castes and Scheduled Tribes Act, 2003. Each commission will have one Chairman and five members to ensure speedy resolution of grievances.
The Cabinet approved an ordinance to amend the Telangana Fire Service Act, 1999, with a focus on fire prevention, identifying the causes of fire accidents and ensuring swift response. It will specify safety precautions for owners of houses, apartments and shopping complexes, along with the responsibilities of the Fire Services Department.
The Cabinet approved an amendment to Section 12(A) of the Telangana Survey and Boundaries Act, 1923, reducing the time limit for filing appeals against survey and boundary notices from 60 days to 30 days.
Minister Ponguleti Srinivasa Reddy, along with Ministers Adluri Laxman Kumar and Vakiti Srihari, briefed the media on the Cabinet decisions.
