Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met His Excellency Sergio Gor, U.S. Ambassador to India, in New Delhi.

భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ గారితో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.

✅ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని, వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని కోరారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కోరారు.

✅ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన వివిధ రంగాల నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. H-1B వీసా ప్రాసెసింగ్‌, రెన్యువల్‌, వీసా స్టాంపింగ్‌ ఆలస్యం కాకుండా సరళతరం చేయాలని కోరారు. వీసా నిబంధనల్లో వచ్చే మార్పులపై ముందుగానే సమాచారం అందించాలని సూచించారు.

✅ అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు. తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు.

✅ అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా సహకరించాలని కోరారు. విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు.

✅ అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిపై రాయబారి సెర్జియో గోర్‌ గారికి ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందన్నారు.

✅ ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర బలాలపై రాయబారి గారు చూపిన ఆసక్తిని ముఖ్యమంత్రి గారు అభినందించారు. తెలంగాణ – అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాయబారి సెర్జియో గోర్ గారు హామీ ఇచ్చారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met His Excellency Sergio Gor, U.S. Ambassador to India, in New Delhi and discussed strengthening cooperation between Telangana and the United States in education, employment, investments, technology, and research.

🔹 The Chief Minister requested enhanced visa support for Telangana students pursuing higher education in the U.S., including increased visa appointments, additional interview slots, and faster processing. He also highlighted concerns faced by Telangana professionals in the U.S. and sought streamlined H-1B visa processing, renewals, and stamping procedures.

🔹 Discussions also covered student welfare, academic partnerships, research collaboration, innovation, and skill development initiatives between Telangana institutions and U.S. universities. Sri Revanth Reddy emphasized Telangana’s strong investment potential in IT, Artificial Intelligence, Life Sciences, Pharma, Startups, and advanced technologies.

🔹 The Chief Minister appreciated Ambassador Sergio Gor’s interest in Telangana’s culture and strengths. The Ambassador assured full support in expanding trade, investment, cultural exchanges, and people-to-people ties between Telangana and the United States.