వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఇప్పటినుంచి ప్రతి నెలా పనుల పురోగతిని తనిఖీ చేస్తానని చెప్పారు.

ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియో థెరఫీ – పారా మెడికల్ కాలేజీలు, సంబంధిత హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతీ నెలా పనుల పురోగతిపై తనిఖీ చేయడమే కాకుండా ఒక రోజు సైట్‌లోనే బస చేస్తానని చెప్పారు.
పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిని సస్పెండ్ చేయడానికి వెనుకాడొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.
భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy conducted an on-ground inspection of the Kodangal Education Hub works at Hakeempet, Vikarabad district, and reviewed the progress of ongoing construction activities.
The Chief Minister inspected the construction works of Engineering, Medical, Nursing, Veterinary, Physiotherapy and Paramedical Colleges, hostels and other infrastructure facilities, and issued necessary instructions to officials.
Expressing displeasure over the slow pace of works, the Chief Minister instructed officials to expedite construction, submit monthly progress reports and ensure timely completion of the projects.
He also instructed officials to complete the allotment of plots and issue pattas to farmers who lost their lands for the project within a week.
