Hon’ble CM Sri Revanth Reddy Lays Foundation Stone for the Integrated Fruit Market & Integrated Sub-Registrar Office Complex at Koheda.

హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలి ప్రాంతంలో 1.34 కోట్ల జనాభాతో వేగంగా విస్తరించిన నేపథ్యంలో ఈ ప్రాంత అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

✅ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌ను ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

✅ పండ్ల మార్కెట్‌తో పాటు సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు.

✅“రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలకు ఏం కావాలన్నా ఇక్కడికి వస్తే అన్నీ అందుబాటులో ఉండే విధంగా 240 ఎకరాల్లో రూ. 2,300 కోట్లతో అత్యాధునిక వసతులతో మార్కెట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత ఈ మార్కెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

✅ 30, 40 ఏండ్ల కిందట పండ్లు, కూరగాయల పంటల సాగుతో రంగారెడ్డి జిల్లా కళకళలాడిందని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా రైతులు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు పండ్లు, కూరగాయలు, పాలు సరఫరా చేసేవారని, రియల్ ఎస్టేట్ విస్తరణతో వ్యవసాయం కుంటుపడిందని చెప్పారు.

✅ ఈ ప్రాంత ప్రజలు ఏది కొనాలన్నా పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి వంటి కేవలం నాలుగైదు పంటలను మాత్రమే పండించడం వల్ల ప్రజలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు.

✅ కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, అందుకు ప్రత్యామ్నాయంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రత్యామ్నాయ పంటలను పండించాలని కోరారు.

✅ స్థానిక ప్రజల సహకారంతో ప్రభుత్వం ధైర్యంగా ఈ పండ్ల మార్కెట్‌ను ప్రారంభించింది. వచ్చే రెండేళ్లలో దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం. ఈ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నిధుల కొరత లేకుండా గ్రీన్ చానెల్‌లో విడుదల చేస్తాం. వచ్చే డిసెంబర్‌లో పనులు ప్రారంభించే విధంగా శ్రమించాలి అని మంత్రులకు సూచించారు.

✅ భారత్ ఫ్యూచర్ సిటీలో కాలుష్య కారక పరిశ్రమలు తెస్తామంటే, ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని, అందుకే ఆ ప్రాంతంలో ఒక మహానగరాన్ని నిర్మించి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఫార్చూన్ 500 కంపెనీలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

✅ “రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి ఏటా 15 నుంచి 16 వేల కోట్ల ఆదాయం సమకూర్చుతున్నప్పటికీ ఎవరైనా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా ఉండదు. ఇలాంటి దుస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతోనే అత్యాధునిక వసతులతో ఈ పక్కనే సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి కూడా శంకుస్థాపన చేశాం” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

✅ హైదరాబాద్ నగరంలో 39 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే వాటిని 12 క్లస్టర్లుగా అత్యంత అధునాతన సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించుకుంటున్నామని తెలిపారు.

✅ “అంతర్జాతీయ నగరమని మనకు మనం గొప్పులు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే ఆ గుర్తింపు వస్తుంది. అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, మెట్రో విస్తరణ వంటి పనులను పూర్తి చేస్తాం” అని స్పష్టం చేశారు.

✅ కోహెడ పండ్ల మార్కెట్ నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే రాష్ట్రంలో అభివృద్ధి జరిగినట్టేనని, రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy laid the foundation stone for the International Integrated Fruit Market being constructed by the Agriculture Department at Koheda, Abdullapurmet, Ranga Reddy district. He also laid the foundation stone for the Integrated Sub-Registrar Office Complex being developed alongside the fruit market.

Ministers Sri Tummala Nageswara Rao, Sri Duddilla Sridhar Babu, and Sri Ponguleti Srinivasa Reddy, along with several public representatives, participated in the event. On this occasion, the Chief Minister addressed the gathering.

Chief Minister Sri A. Revanth Reddy stated that, in view of the rapid expansion of the Hyderabad Outer Ring Road (ORR) region, which now has a population of 13.4 million (1.34 crore), the government is constructing an international-standard integrated fruit market to meet the needs of the area.