
హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి విగ్రహం, జంక్షన్ పనులను వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.






