
రాష్ట్రంలో మెగా గ్రోత్ కరిడార్ల అభివృద్ధి, వాటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్‌ల్లో ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్ల అభివృద్ధి చేసే గ్రోత్ కారిడార్ భవిష్యత్తు తెలంగాణకు అత్యంత కీలకమని చెప్పారు.






