తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026’ అధికారిక లోగో, మస్కట్లను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ గారు ఆవిష్కరించారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, రాష్ట్ర మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. 27 క్రీడాంశాల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు తలపడనున్నారని తెలిపారు.
మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ. 113 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు పెంచినట్లు సీఎం గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
The official logo and mascots of the 8th ‘Khelo India Youth Games – 2026’, to be held in Telangana from December 11 to 22, were unveiled by Hon’ble Chief Minister Sri A. Revanth Reddy and Hon’ble Union Sports Minister Sri Mansukh Mandaviya.
Hon’ble State Minister Sri Vakiti Srihari, Minister Sri N. Uttam Kumar Reddy, Government Advisor (Sports) Sri A.P. Jitender Reddy, Chief Secretary Sri Sanjay Jaju and senior officials participated in the event held in Delhi.
The Chief Minister stated that stadiums were ready in Hyderabad and various district headquarters to host the games, with over 7,000 athletes competing in 27 disciplines.
The Chief Minister informed the Union Minister that the State’s sports budget had increased from Rs. 113 crore to Rs. 465 crore in three years. Construction of 61 mini stadiums was completed, while work on 15 others was underway.
